Samsung Galaxy A35 5G
Samsung Galaxy A35 5G : శాంసంగ్ అభిమానులు పండగ చేస్కోండి. కొత్త శాంసంగ్ 5జీ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. లాంచ్ ధర కన్నా అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ ఈ అద్భుతమైన (Samsung Galaxy A35 5G) తగ్గింపును అందిస్తోంది. ఫోన్ ప్రైమరీ కెమెరా 50MP కలిగి ఉంది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లో దసరా, దీపావళి సేల్స్ సమయంలో ఈ ఆఫర్ మిస్ అయితే డోంట్ వర్రీ.. సేల్ ముగిసిన తర్వాత కూడా మీరు శాంసంగ్ వెబ్‌సైట్‌లో అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A35 5జీ ఫోన్ భారీ తగ్గింపు ధరకే అమ్ముడవుతోంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో బేస్ మోడల్ ధర రూ. 30,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం శాంసంగ్ వెబ్‌సైట్‌లో ఈ గాడ్జెట్ ధర రూ. 18,999కు అందుబాటులో ఉంది. మీరు శాంసంగ్ యాక్సస్ బ్యాంకు కార్డుతో ఈ గెలాక్సీ A35 5జీ ఫోన్ కొనుగోలు చేస్తే 10శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర అద్భుతమైన ఫీచర్లతో పాటు శాంసంగ్ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫీచర్లు :
ఈ శాంసంగ్ ఫోన్ 6.6-అంగుళాల సూపర్ అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది. ఆకర్షణీయమైన రిఫ్రెష్ రేట్ 120Hz, 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 8GB ర్యామ్ కలిగి ఉంది. ఎక్సినోస్ 1380 చిప్‌సెట్ సీపీయూ కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో ట్రిపుల్ కెమెరా కలిగి ఉంది. 5MP మాక్రో సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది.
ఈ ఫోన్‌లోని సెల్ఫీ కెమెరా 13MP కలిగి ఉంది. అంతేకాదు.. 5000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ శాంసంగ్ వన్‌యూఐ 6.1, ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రూపొందింది. బయోమెట్రిక్ సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. IP67 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉంది. అద్భుతమైన సౌండ్ కోసం డాల్బీ ఆడియో కలిగి ఉంది.