Flipkart Special Sale : ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్.. రూ.15 వేలకే ఆపిల్ ఐఫోన్.. లిమిటెడ్ ఆఫర్
మీ పాత స్మార్ట్ ఫోన్ మార్చి కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో బంపర్ ఆఫర్.. మీ పాత ఫోన్ ఇచ్చి.. కొత్త ఆపిల్ ఐఫోన్ తెచ్చుకోండి.. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఈ ఎక్స్ ఛేంజ్ ఆఫర్ తీసుకొచ్చింది.
- Sreehari A
- Published On : May 11, 2021 / 07:50 AM IST
Apple Iphone Se Get Rs. 15,000 With Discount On Exchange Offer
Flipkart Special Sale : మీ పాత స్మార్ట్ ఫోన్ మార్చి కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో బంపర్ ఆఫర్.. మీ పాత ఫోన్ ఇచ్చి.. కొత్త ఆపిల్ ఐఫోన్ తెచ్చుకోండి.. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఈ ఎక్స్ ఛేంజ్ ఆఫర్ తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో మే 10 నుంచి మే 14 వరకు ఈ స్పెషల్ సేల్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
మీరు చేయాల్సిందిల్లా మీ పాత స్మార్ట్ ఫోన్ ఏదైనా ఉంటే… ఎక్స్ ఛేంజ్ చేసుకోండి.. లక్షల విలువైన ఐఫోన్ కేవలం రూ.15వేలకే సొంతం చేసుకోండి.. ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కింద తక్కువ ధరకే అందించే ఈ ఆపిల్ ఐఫోన్ SE స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్, రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
iPhone SE 64GB మోడల్ ధర రూ.30,999గా ఉంది.. 128GB వేరియంట్ ధర రూ.33,999, 256GB వేరియంట్ ధర రూ.44,999గా అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ఐఫోన్ SE 64GB మోడల్‌ను ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద రూ.15 వేలకే పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ రూ.15,150 విలువ చేస్తే.. రూ.15,849 మీరు చెల్లించాలి. మొదటి సారి మొబైల్ కొంటున్నారా? అయితే మీకు సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నాయా? అలా అయితే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
గరిష్టంగా ఒక కార్డుపై రూ.1,000 తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్ మే 14 వరకే అందుబాటులో ఉండనుంది. ఆపిల్ ఐఫోన్లపై కూడా ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ SE మోడల్‌లో స్పెసిఫికేషన్స్, ఫీచర్లు 4.7 అంగుళాల డిస్‌ప్లేతో పాటు యాపిల్ A13 బయానిక్ చిప్ అందిస్తోంది. కెమెరాల విషయానికి వస్తే.. రియర్ కెమెరా 12MP, ఫ్రంట్ కెమెరా 7MP అందిస్తోంది.
