Flipkart Summer Sale ends tonight _ iPhone 13 available with flat Rs 10,900 discount until 12AM
Flipkart Summer Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో సమ్మర్ సేల్ (Summer Sale)ను నిర్వహిస్తోంది. అనేక పాపులర్ 5G ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. అందులో ఐఫోన్ 13 ఒకటి. అయితే, ఈ సేల్ ఈవెంట్ ఏప్రిల్ 17 అర్ధరాత్రితో ముగుస్తోంది. ఆసక్తి గల వినియోగదారులు ఈ 5G ఫోన్‌ను అందుబాటులో ఉన్న ధరకు కొనుగోలు చేసేందుకు చివరి అవకాశం ఉంది. ఐఫోన్ 13 చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
ఎలాంటి బ్యాంక్ ఆఫర్ లేకుండానే ఈ ఫోన్ ధర రూ. 60వేల కన్నా తక్కువగా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 రూ. 58,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఐఫోన్ అసలు రిటైల్ ధర రూ. 69,900గా ఉంది. అంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై రూ.10,901 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఏ బ్యాంక్ ఆఫర్‌పై ఆధారపడి ఉండదు. ఫ్లిప్‌కార్ట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. అయితే, ఈ సేల్ ఆఫర్ ఈరోజు రాత్రి 12:00AM వరకు మాత్రమే అందుబాటులో ఉంది.
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ. 1,000 తగ్గింపు అందిస్తుంది. ప్రభావవంతంగా ఈ ఐఫోన్ ధరను రూ.57,999కి తగ్గిస్తుంది. ఐఫోన్ ధర 128GB స్టోరేజ్‌తో వచ్చింది. ఈ ఐఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా తమ పాత ఫోన్‌ను విక్రయించేందుకు ఇష్టపడే యూజర్లు iPhone 13 కొనుగోలుపై రూ. 26,250 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీ ప్రస్తుత ఫోన్ కండిషన్, వయస్సు ఆధారంగా ఎక్స్చేంజ్ మొత్తం లెక్కించవచ్చు.
Flipkart Summer Sale ends tonight _ iPhone 13 available with flat Rs 10,900
ఆపిల్ కంపెనీ, ఏప్రిల్ 18న భారత మార్కెట్లో మొదటి విలాసవంతమైన స్టోర్‌ను ఓపెన్ చేసేందుకు రెడీగా ఉంది. ప్రసిద్ధ ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శనలో ఉంచుతుంది. ఆన్‌లైన్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే.. ఆపిల్ అధికారిక స్టోర్‌ని చెక్ చేయవచ్చు. అయితే, ఈ స్టోర్ ముంబైలో మాత్రమే అందుబాటులో ఉంది.
ఢిల్లీలో ఉన్నవారు ఏప్రిల్ 20న కంపెనీ స్టోర్‌లో కొనుగోలు చేయొచ్చు. మీరు ఈ డివైజ్ కొనుగోలు చేయాలంటే మీ ప్రాంతంలోని ఏదైనా రిటైల్ షాప్‌కు వెళ్లవచ్చు. అయినప్పటికీ, మీరు ఆఫ్‌లైన్ మార్కెట్‌లో అదే డిస్కౌంట్ ఆఫర్‌ను పొందలేకపోవచ్చు. ఐఫోన్ 13, కొత్త ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే ఫీచర్లను కలిగి ఉంది. డబ్బు మరింత ఆదా చేయాలంటే ఐఫోన్ పాత వెర్షన్‌ను కొనుగోలు చేయడమే బెటర్. ఎందుకంటే ఆపిల్ ఆరేళ్ల పాత ఫోన్‌లకు కూడా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందిస్తోంది.