EPFO Password : మీ EPFO ​​పాస్‌వర్డ్‌ మర్చిపోయారా? ఎలా రీసెట్ చేయాలంటే? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

EPFO Password : ఈపీఎఫ్ఓ పాస్‌వర్డ్ మర్చిపోయారా? పాస్‌వర్డ్ ఇలా సింపుల్‌గా రీసెట్ చేసుకోవచ్చు.

EPFO Password

EPFO Password : మీరు ఈపీఎఫ్ఓ పాస్‌వర్డ్ మర్చిపోయారా? ఇలా సింపుల్‌గా రీసెట్ చేసుకోవచ్చు. మీ పీఎఫ్ యూఏఎన్ నంబర్‌ను మర్చిపోతే.. మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు.

Read Also : కొత్త రూల్.. ఇకపై ఓలా, ఉబర్ డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేస్తే కస్టమర్లకు డబ్బులు చెల్లించాల్సిందే..!

ఈపీఎఫ్ఓ పీఎఫ్ UAN జారీ చేస్తుంది. 12-అంకెల గుర్తింపు సంఖ్య. కంపెనీ, ఉద్యోగి ఈ 12-అంకెల గుర్తింపు నంబర్‌పై PF కోసం డబ్బును జమ చేస్తారు.

మీరు ఉద్యోగాలు మారినప్పటికీ మీ గుర్తింపు సంఖ్య మారదు. కొత్త కంపెనీ అదే నంబర్‌ను జారీ చేయడం ద్వారా PF డబ్బును జమ చేస్తుంది. ఈపీఎఫ్ఓ పాస్‌వర్డ్‌ను ఎలా జనరేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాస్‌వర్డ్ ఇలా ఉండాలి :
కొత్త UAN లాగిన్ పాస్‌వర్డ్ కనీసం 20 క్యారెక్టర్స్ లాంగ్ ఉండవచ్చు. ఇందులో కనీసం 4 లెటర్స్, రెండు అంకెలు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇందులో కనీసం ఒక క్యాపిటల్ లెటర్, ఒక చిన్న క్యారెక్టర్ ఉండాలి.

పాస్‌వర్డ్‌ను ఎలా రీసెట్ చేయాలి? :
1.EPFO ​​అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. హోమ్‌పేజీలో ‘Forgot Password’ లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
4. ‘Verify’ బటన్‌పై క్లిక్ చేయండి.
5. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP పంపుతారు.
6. OTPని ఎంటర్ చేసి ‘Verify’పై క్లిక్ చేయండి.
7. కొత్త పాస్‌వర్డ్‌ను సెట్ చేసి ‘Submit’పై క్లిక్ చేయండి.

మీ పాస్‌వర్డ్ రీసెట్ అయ్యాక ఇప్పుడు మీ కొత్త పాస్‌వర్డ్‌ని ఉపయోగించి EPF పాస్‌బుక్‌లోకి లాగిన్ అవ్వొచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ సభ్యులకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) జారీ చేస్తోంది.

ఇటీవలే, PF నుంచి డబ్బులను విత్‌డ్రా చేసే ప్రక్రియను సులభతరం చేసింది. ఒక ఉద్యోగి ఉద్యోగం నుంచి నిష్క్రమించినప్పుడు లేదా మరొక ఉద్యోగంలో చేరినప్పుడు రెండు UAN నంబర్లు ఉండకూడదు.

ఈపీఎఫ్ఓ ద్వారా UAN నెంబర్ ఉద్యోగికి జారీ చేస్తారు. ఒక ఉద్యోగాన్ని వదిలి మరొక ఉద్యోగంలో చేరితే UAN నంబర్‌ను మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత పాత PF ఖాతా మొత్తం కొత్త అకౌంట్‌కు బదిలీ అవుతుంది. కానీ, ఒక సభ్యుని పేరుతో రెండు లేదా అంతకంటే ఎక్కువ UAN నంబర్‌లు ఉండకూడదు.

Read Also : Tata Curve EV : కొత్త ఎలక్ట్రిక్ కారు భలే ఉందిగా.. సరసమైన ధరకే టాటా కర్వ్ EV కారు.. ఫుల్ ఛార్జ్‌తో 502 కి.మీ రేంజ్!

ఇలాంటి పరిస్థితిలో ఉద్యోగి PF విత్‌డ్రా కోసం దరఖాస్తు చేస్తే ఏ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారో సిస్టమ్‌కు తెలియదు. ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. విత్ డ్రా అయ్యేందుకు చాలా సమయం పడుతుంది.