Free Apple Music
Free Apple Music For Airtel Prepaid : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందొచ్చు తెలుసా? టెలికాం దిగ్గజం భారతి (Free Apple Music) ఎయిర్‌టెల్ దేశంలో ఎంపిక చేసిన కొంతమంది ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఫ్రీగా ఆపిల్ మ్యూజిక్ సర్వీసును ఆఫర్ చేస్తోంది. గతంలో, ఈ బెనిఫిట్ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు కంపెనీ ప్రీపెయిడ్ ప్లాన్‌లకు కూడా విస్తరిస్తోంది.
6 నెలలు ఉచితం :
ఈ ప్రమోషన్ ద్వారా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు 6 నెలల పాటు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఆపిల్ మ్యూజిక్ యాక్సస్ చేయొచ్చు. ట్రయల్ తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేయకపోతే సబ్స్క్రిప్షన్ నెలకు రూ. 119 చెల్లించి రెన్యువల్ చేయొచ్చు. సాధారణంగా ఫ్రీ లేదా యాడ్ ఫ్రీ సపోర్టు మ్యూజిక్ యాప్‌లపై ఆధారపడే యూజర్లకు ముందస్తు ఛార్జీలు లేకుండా ప్రీమియం సర్వీసును పొందడానికి అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు.
మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ కోసం ఎయిర్‌టెల్ కచ్చితమైన నిబంధనలను వెల్లడించలేదు. కొన్ని రీఛార్జ్ ప్యాక్‌లకు మాత్రమే పరిమితం కాకపోవచ్చు. అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్లు లేని కస్టమర్‌లు కూడా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. కొంతమంది యూజర్లు ఇప్పటికే ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ బ్యానర్ గుర్తించారు.
అదనపు ఖర్చు లేకుండా ఆపిల్ మ్యూజిక్ యాక్సస్ చేయొచ్చు. ఆపిల్‌తో ఎయిర్‌టెల్ భాగస్వామ్యం ప్రీపెయిడ్ ప్లాన్లను మరింత ఆకర్షణీయంగా అందించాలని భావిస్తోంది. 6 నెలల ఫ్రీ ట్రయల్ మ్యూజిక్ లవర్స్ కోసం అందించనుంది.
యాడ్-ఫ్రీ సాంగ్స్, రెడీమేడ్ ప్లేలిస్టులు, ఆఫ్‌లైన్ లిజనింగ్‌తో ఆపిల్ మ్యూజిక్‌ను యాక్సస్ చేయొచ్చు. ట్రయల్ ముగిసిన తర్వాత యూజర్లు పేమెంట్ ప్లాన్లను కొనసాగించవచ్చు. తద్వారా ఆపిల్ ఇండియాలో ఎక్కువ మంది సబ్‌స్ర్కిప్షన్లను పొందవచ్చు.
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ప్రీమియం సర్వీసులను అందించడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు.. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం వంటి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. అందులోనూ అన్ని 5G డేటాతోనే ఆఫర్ చేస్తోంది. ఎయిర్‌టెల్ పెర్ప్లెక్సిటీ ఏఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రీమియం ఏఐ సర్వీసులకు ఫ్రీ యాక్సెస్‌ను కూడా అందిస్తోంది. ఆపిల్ మ్యూజిక్‌ను ప్రీపెయిడ్ యూజర్లకు విస్తరించనుంది.