Gmail Record : ఆండ్రాయిడ్‌పై జీమెయిల్ న్యూ రికార్డు.. 10 బిలియన్ల మార్క్ దాటేసింది..!

గూగుల్ సొంత సర్వీసు జీమెయిల్ ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై న్యూ రికార్డు క్రియేట్ చేసింది. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో అత్యధికంగా ఇన్ స్టాల్ అయిన నాల్గో యాప్ గా నిలిచింది.

Gmail Record : ప్రపంచ సెర్ఛ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత సర్వీసు జీమెయిల్ ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై న్యూ రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో అత్యధికంగా ఇన్ స్టాల్ అయిన 4వ యాప్‌గా జీమెయిల్ నిలిచింది. గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)లో జీమెయిల్ యాప్ 10 బిలియన్ల ఇన్‌స్టాల్ అయిన నాల్గో యాప్‌గా మైల్ స్టోన్ చేరింది. జీమెయిల్‌తో పాటు మరో మూడు పాపులర్ యాప్స్ Google Maps, YouTube, Google Play Services తర్వాతి స్థానంలో జీమెయిల్ నిలిచింది. 2004లో గూగుల్ జీమెయిల్ సర్వీసులను ప్రవేశపెట్టింది.

అప్పటినుంచి జీమెయిల్ యాప్‌లో మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను జోడిస్తూ వస్తోంది గూగుల్. ఇటీవలే జీమెయిల్ యాప్‌లో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.. అదే.. Undo Send ఫీచర్.. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు రీకాల్ ఈమెయిల్స్ చేసేందుకు అనుమతించనుంది. Google Play Serivces (గూగుల్ ప్లే సర్వీసెస్) 10 బిలియన్ ఇన్ స్టాల్ అయి మైల్ స్టోన్ చేరిన నాల్గో యాప్‌గా ఆండ్రాయిడ్ పోలీస్ (Andorid Police)లో కనిపించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో జీమెయిల్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ ప్లే సర్వీసులు ప్రీ-ఇన్ స్టాల్ అయి ఉంటాయి.

అందుకే అత్యధిక స్థాయిలో10 బిలియన్ డౌన్‌లోడ్ల రికార్డును క్రియేట్ చేశాయి. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ వంటి యాప్స్ కూడా భారీగా ఆదరణ పొందాయి. గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి అత్యధిక స్థాయిలో ఆదరణ పొందాయి. అంతేకాదు.. ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన Whatsapp, Messenger, Telegram వంటి యాప్స్ భారీగా పాపులర్ అయ్యాయి. గూగుల్‌ మీట్స్‌ను యాప్‌ కూడా తీసుకొచ్చింది. ఇటీవలే ఆడియో, వీడియో కాల్స్‌ కోసం ఫీచర్‌ను కూడా జీమెయిల్‌ ప్రవేశపెట్టింది.

Read Also : Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఆ మోడళ్ల ధరలు పెంచేసింది.. కొత్త ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు