Google Chrome : గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. Incognito మోడ్ బ్రౌజర్‌లో కొత్త ఫింగర్‌ఫ్రింట్ ఫీచర్.. మీ డేటా మరింత భద్రం.. ఎలా వాడాలంటే?

Google Chrome : ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గత కొన్ని ఏళ్లుగా సైబర్ నేరాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. యూజర్ల డేటా చోరీకి సంబంధించి వివిధ భద్రతపరమైన సమస్యలకు గురవుతోంది.

Google Chrome : ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గత కొన్ని ఏళ్లుగా సైబర్ నేరాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. యూజర్ల డేటా చోరీకి సంబంధించి వివిధ భద్రతపరమైన సమస్యలకు గురవుతోంది. దాంతో అన్ని టెక్ కంపెనీలకు ఆన్‌లైన్ రిస్క్‌లను ప్రొటెక్ట్ చేసేందుకు సరికొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. క్రాస్-ప్లాట్‌ఫారమ్ వెబ్ బ్రౌజర్ క్రోమ్‌ను డెవలప్ చేసిన (Google) తమ యూజర్లకు సురక్షితమైన ఆన్‌లైన్ అనుభవాన్ని అందించనుంది. మరోవైపు గూగుల్ యూజర్ల ప్రైవసీ సెట్టింగ్‌లు, సెక్యూరిటీ ఫీచర్లపై నిరంతరం పని చేస్తోంది. ‘privacy by design’ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని Google ఇటీవల Chromeలో Incognito మోడ్ కోసం కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసింది. యూజర్లకు మరింత ప్రైవసీ, సెక్యూరిటీని అందిస్తుంది.

డేటా ప్రైవసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని Google ఇటీవలి బ్లాగ్ పోస్ట్‌లో Android యూజర్ల కోసం Chrome Incognito ట్యాబ్ కోసం బయోమెట్రిక్ లాక్‌ని యాడ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఫీచర్ గత ఏడాది నుండి డెవలప్ స్టేజీలో ఉంది. అదిఇప్పటికే iOS యూజర్లకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. Chromeలో Incognito ట్యాబ్‌ల కోసం ఫింగర్‌ఫ్రింట్ లాక్ ఎలా పని చేస్తుందో Android, iOS డివైజ్‌లలో ఎలా ప్రారంభించాలో ఇప్పుడు చూద్దాం.

Incognito ట్యాబ్‌లో ఫింగర్ ఫ్రింట్ లాక్ అంటే ఏంటి? :
గూగుల్ క్రోమ్ (Chrome)లో Incognito ట్యాబ్‌ల కోసం కొత్త ఫింగర్ ఫ్రింట్ లాక్ ప్రైవేట్ బ్రౌజింగ్ కోసం అదనపు సెక్యూరిటీని యాడ్ చేస్తోంది. ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేయడం ద్వారా బ్రౌజర్‌ను క్లోజ్ చేసిన తర్వాత మళ్లీ ఓపెన్ చేస్తే ట్యాబ్‌లను అన్‌లాక్ చేస్తుంది. అప్పుడు వినియోగదారులు తమ ఫింగర్ ఫ్రింట్ ఉపయోగించాల్సి ఉంటుంది. అంతరాయం కలిగిన Incognito సెషన్‌ను మీరు రీస్టోర్ చేసినప్పుడు మీ బయోమెట్రిక్ అథెంటికేషన్ అవసరం కావచ్చు. iOSలోని Chrome యూజర్ల అందరికి ఈ ఫీచర్ ఇప్పటికేఅందుబాటులో ఉంది. ప్రస్తుతం Android యూజర్రలకు అందుబాటులో వచ్చిందని Google బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Read Also : Fire Boltt Cobra : ఆపిల్ వాచ్, గార్మిన్ సోలార్ వాచ్‌కు పోటీగా.. రూ. 4వేల ధరకే ఫైర్ బోల్ట్ కోబ్రా స్మార్ట్‌వాచ్ వచ్చేస్తోంది!

క్రోమ్‌లో ఫింగర్ ఫ్రింట్ లాక్‌ని ఎలా పొందాలంటే? :
ముందుగా చెప్పినట్లుగా.. Incognito ట్యాబ్‌ల ఫీచర్ కోసం ఫింగర్‌ఫ్రింట్ లాక్ ఇప్పుడు iOS, Android రెండింటికీ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌లో ఈ ఫీచర్‌ని పొందాలంటే.. క్రోమ్ అప్‌డేట్ చేసిన వెర్షన్‌ని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. ఆ యాప్ అప్‌డేట్ చేసేందుకు Google Play Store> Google Chromeకి వెళ్లి అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Google Chrome adds fingerprint to make Incognito more secure

Incognito ట్యాబ్‌లలో ఫింగర్ ఫ్రింట్ లాక్‌ ఎలా సెట్ చేయాలంటే? :

– మీ Chrome అప్‌డేట్ తర్వాత.. క్రోమ్‌లోని Incognito ట్యాబ్‌లలో మీరు ఫింగర్ ఫ్రింట్ లాక్‌ని ఎలా ప్రారంభించవచ్చు.
– మీ Android డివైజ్‌లో Chrome యాప్‌ని ఓపెన్ చేయండి.
– Settings Menu యాక్సెస్ చేసేందుకు టాప్-రైట్ కార్నర్‌లో త్రిడాట్స్‌పై Tap చేయండి.
– ‘Privacy & Security’ ఎంచుకోండి.
– మీరు Chromeని క్లోజ్ చేసినప్పుడు Incognito ట్యాబ్‌లను లాక్ చేసే ఎంపికపై టోగుల్ చేయండి.
– మీ రిజిస్టర్డ్ ఫింగర్ ఫ్రింట్‌తో అన్ని Incognito ట్యాబ్‌లు లాక్ అవుతాయి.

Google Chrome మీ స్మార్ట్‌ఫోన్‌లో రిజిస్టర్ చేసిన ఫింగర్‌ఫ్రింట్ డేటాను ఉపయోగిస్తుంది. ఈ ఫీచర్ కోసం Chromeలో మీ ఫింగర్ ఫ్రింట్ మళ్లీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. Google ఆన్‌లైన్ ప్రైవసీ, సెక్యూరిటీని ప్రాధాన్యతగా తీసుకుంటోంది. సేప్ ఆన్‌లైన్ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి యూజర్లకు సాయపడేందుకు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంది. క్రోమ్‌లో అందుబాటులో ఉన్న ఇతర సెక్యూరిటీ ఫీచర్లను వివరంగా పరిశీలిద్దాం.

గూగుల్ క్రోమ్ ప్రైవసీ గైడ్ :
Google Chrome ప్రైవసీ గైడ్ ద్వారా బ్రౌజర్‌లో అందుబాటులో ఉన్న కీలక ప్రైవసీ, సెక్యూరిటీ కంట్రోల్ దశల వారీ గైడ్‌ని కలిగి ఉంటుంది.

Chromeలో సెక్యూరిటీ చెకింగ్ :
డెస్క్‌టాప్, మొబైల్ డివైజ్‌లలో Chrome సెక్యూరిటీ చెకింగ్ క్రమం తప్పకుండా అమలు చేయాలని Google యూజర్లను సిఫార్సు చేస్తుంది. సెక్యూరిటీ చెకింగ్ ఫీచర్ ద్వారా పాస్‌వర్డ్‌లు లేదా హానికరమైన Extension గుర్తించినప్పుడల్లా వార్నింగ్ పంపుతుంది. అదనంగా.. అందుబాటులో ఉన్న కొత్త అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేయమని యూజర్లను అలర్ట్ చేస్తుంది. Google ఇంతకుముందు వెబ్‌సైట్‌లతో షేర్ చేసిన వాటి గురించి కూడా అప్రమత్తం చేస్తుంది. వాటికి సంబంధించి రిమైండర్‌లను కూడా రిలీజ్ చేస్తోంది. ఏయే వెబ్‌సైట్లకు అనుమతులను రద్దు చేయాలి? డేటా ప్రైవసీని ఎలా ప్రొటెక్ట్ చేయాలి దానిపై యూజర్లకు కంట్రోల్ ఇస్తుంది.

Clear బ్రౌజింగ్ డేటా :
యూజర్లు బ్రౌజింగ్ హిస్టరీ, కుక్కీ (Cookies)లు, కాష్‌ (Cache)తో సహా Chrome బ్రౌజింగ్ డేటాను నిర్దిష్ట సమయం నుంచి లేదా అన్నింటినీ కలిపి డిలీట్ చేయవచ్చు. ఇంకా Google క్రోమ్ విజిట్ చేసిన పేజీల నుంచి ఆటోఫిల్ ఎంట్రీలకు వ్యక్తిగత అంశాలను డిలీట్ చేయడాన్ని అనుమతించడం ద్వారా మరింత కంట్రోల్ చేసేందుకు అనుమతిస్తుంది. Chrome అడ్రస్ బార్‌లో ‘బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయండి’ అని టైప్ చేయడం ద్వారా బ్రౌజింగ్ డేటాను మరింత క్లియర్ చేయవచ్చు.

Google పాస్‌వర్డ్ మేనేజర్ :
గూగుల్ క్రోమ్ (Google Chrome) పాస్‌వర్డ్ మేనేజర్ కంప్యూటర్ లేదా ఫోన్‌లో పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేయడానికి, లేదా గుర్తించుకోవడానికి ఆటోఫిల్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ నేరుగా Chromeలో అందుబాటులో ఉంది. మల్టీడివైజ్‌ల్లోనూ అందుబాటులో ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Infinix Zerobook : 12వ జెన్-ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్‌తో ఇన్‌ఫినిక్స్ జీరోబుక్ ల్యాప్‌టాప్ వచ్చేసింది.. క్రియేటర్ల కోసం స్పెషల్ ఫీచర్లు, భారత్‌లో ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు