Google Chrome’s New Update Brings Feature
Google Chrome New Update : క్రోమ్ యూజర్లకు గుడ్ న్యూస్.. సెర్చ్ దిగ్గజం గూగుల్ తమ క్రోమ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే.. ‘Listen To this Page’ ఫీచర్. కొత్త అప్‌డేట్ క్రోమ్ 130 ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్ సపోర్ట్‌ను కలిగి ఉంది.
వినియోగదారులు తమ డివైజ్‌లలో ఇతర అప్లికేషన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు కూడా వెబ్ పేజీలోని ఆర్టికల్స్ వినడానికి అనుమతిస్తుంది. నివేదిక ప్రకారం.. ఒక మీడియా ప్లేయర్ నోటిఫికేషన్ బార్‌లో కనిపిస్తుంది. వినియోగదారుకు ప్రైమరీ కంట్రోల్స్ అందిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వెబ్ పేజీలోని ఆర్టికల్ క్యాప్షన్, వెబ్‌సైట్ వెబ్‌సైట్‌ను డిస్‌ప్లే చేస్తుంది.
ఈ కొత్త లిజన్ టు వెబ్ పేజీ అనే ఫీచర్ వినియోగదారులను 10 విభిన్న వాయిస్‌లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇంక్రిమెంట్‌లలో ప్లేబ్యాక్ స్పీడ్ 0.5ఎక్స్ నుంచి 4ఎక్స్ వరకు అడ్జెస్ట్ చేసేందుకు అనుమతిస్తుంది. అదనంగా, వినియోగదారులు ‘హైలైట్ టెక్స్ట్ అండ్ ఆటో స్క్రోల్’ని కూడా ఎనేబుల్ చేయవచ్చు. ఈ అప్‌గ్రేడ్‌కు ముందు ఆండ్రాయిడ్ యూజర్లు క్రోమ్ యాప్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు మాత్రమే వెబ్ పేజీలను బిగ్గరగా చదువుతుంది.
వినియోగదారులు ట్యాబ్‌లను మార్చుకోవచ్చు. కానీ, యూజర్లు తమ బ్రౌజర్ నుంచి నిష్క్రమించినా లేదా వారి స్క్రీన్‌ని క్లోజ్ చేసినా క్రోమ్ ముందుభాగంలో లేనంతవరకు ఆడియో ఆగిపోతుంది. అయితే, కొత్త అప్‌డేట్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఇతర యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు యాప్ వెబ్ కంటెంట్‌ను చదవడానికి యూజర్లను అనుమతిస్తుంది. నోటిఫికేషన్ ట్యాబ్‌లో కనిపించే మీడియా ప్లేయర్, 10-సెకన్ల స్కిప్/రివైండ్ బటన్‌ను కూడా కలిగి ఉంటుంది.
క్రోమ్ రీడ్ ఆర్టికల్స్ ఫీచర్.. ఇది ఎలా పనిచేస్తుందంటే? :
టెక్ దిగ్గజం ప్రకారం.. ఈ ‘Listen to this Page’ ఫీచర్‌లో అందుబాటులో ఉన్న భాషల్లో అరబిక్, బెంగాలీ, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, జపనీస్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ ఉన్నాయి. వినియోగదారులు రూబీ (మిడ్-పిచ్), రివర్ (మిడ్-పిచ్, బ్రైట్), ఫీల్డ్ (లో-పిచ్) మోస్ (లో-పిచ్) సహా వివిధ వాయిస్ మాడ్యూల్స్ నుంచి కూడా ఎంచుకోవచ్చు.