Google Meet: గూగుల్ మీట్‌లో మీటింగ్‌లు ఇక నుంచి యూట్యూబ్‌లో లైవ్

టెక్ దిగ్గజం గూగుల్ మరో ఫీచర్ తీసుకొచ్చింది. గూగుల్ మీట్ యూజర్ల మీటింగ్‌ను ఇకపై యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ లో చూడొచ్చు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. మీటింగ్ యాక్టివిటీస్ ప్యానెల్‌కు మీటింగ్‌ను నేవిగేట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ సెలక్ట్ చేశారు.

 

Google Meet: టెక్ దిగ్గజం గూగుల్ మరో ఫీచర్ తీసుకొచ్చింది. గూగుల్ మీట్ యూజర్ల మీటింగ్‌ను ఇకపై యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ లో చూడొచ్చు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. మీటింగ్ యాక్టివిటీస్ ప్యానెల్‌కు మీటింగ్‌ను నేవిగేట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ సెలక్ట్ చేశారు.

యూజర్లు వారి ఛానెల్‌ను సెలక్ట్ చేసుకుని మీటింగ్ స్ట్రీమింగ్‌ను స్టార్ట్ చేసుకోవచ్చు.

“వినియోగదారులు తమ సంస్థయేతరులకు ఎక్కువ సమాచారాన్ని అందించాలనుకునే సందర్భాల్లో ప్రత్యక్ష ప్రసారం ఉపయోగకరంగా ఉంటుంది, తద్వారా పాజ్ చేసుకోవడానికి, అవసరమైనప్పుడు రీప్లే చేసుకునే వీలు కల్పిస్తుంది” అని Google వివరించింది.

Read ALso: గూగుల్ మీట్‌‌లో అతిథులకు ఆహ్వానం.. జొమాటోలో పెళ్లి భోజనం డెలివరీ

YouTubeలో ప్రత్యక్ష ప్రసారం కోసం ఛానెల్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. Google Meet ద్వారా లైవ్‌స్ట్రీమ్ చేయడానికి ముందుగా ఛానెల్ తప్పనిసరిగా ఆమోదించాలని వినియోగదారులకు Google హెచ్చరించింది.

హోస్ట్ మేనేజ్‌మెంట్ ఆన్‌లో ఉన్నప్పుడు, హోస్ట్, సహ-హోస్ట్‌లకు మాత్రమే సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగలిగే యాక్సెస్ ఉంటుంది. వారు ఆఫ్‌లో ఉంటే, మీటింగ్‌కు హాజరయ్యే ఎవరైనా దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించవచ్చు. సమావేశాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయడం వంటి ఫీచర్, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుండి మీట్‌ను వేరు చేయడానికి Google మరో మార్గంగా ఎంచుకున్నట్లుగా కనిపిస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు