Google: స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలతో గూగుల్‌ డీల్.. కోర్టుకెక్కిన ఎపిక్స్!

అమెరికన్ గేమింగ్ కంపెనీ ఎపిక్ గేమ్స్ దాని యాక్షన్ గేమ్ ఫోర్ట్‌నైట్ కోసం వినియోగదారుల నుండి నేరుగా మెంబర్‌షిప్ తీసుకుని పనిచేస్తుంటాయి.

Google

Google: అమెరికన్ గేమింగ్ కంపెనీ ఎపిక్ గేమ్స్ దాని యాక్షన్ గేమ్ ఫోర్ట్‌నైట్ కోసం వినియోగదారుల నుండి నేరుగా మెంబర్‌షిప్ తీసుకుని పనిచేస్తుంటాయి. అయితే, గూగుల్ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ మార్కెట్‌ పోటీలో నిలబడేందుకు గూగుల్‌ వ్యవహరిస్తున్న తీరుపై ఆయా కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గూగుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు థర్డ్ పార్టీ యాప్ స్టోర్‌లను అనుమతించకుండా ఉండేందుకు ఒప్పొందాలు చేసుకుంటున్నాయి. ఇందుకోసం అదనపు ప్రోత్సాహకాలను అందించేందుకు కూడా గూగుల్ సిద్ధం అవుతోంది.

2019 ప్రారంభంలో, గూగుల్ ఒక “ప్రీమియర్ డివైస్ ప్రోగ్రామ్” ని ప్రారంభించింది. ఈ ఒప్పొందం ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ పరికరాల్లో థర్డ్-పార్టీ యాప్ స్టోర్‌లకు అనుమతి ఇవ్వకుండా చూసుకున్నాయి. దీనికి అంగీకరిస్తే స్మార్ట్ ఫోన్ కంపెనీలకు సెర్చ్ రెవెన్యూలో ఎక్కువ వాటాను అందించనున్నట్లు వెల్లడించాయి. ఆండ్రాయిడ్ పరికరాల్లో గూగుల్ తన ప్లే స్టోర్ గుత్తాధిపత్యాన్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకుంది.

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌లలో థర్డ్‌ పార్టీ యాప్‌లకు చోటు లేకుండా చేయడం.. తద్వారా ఫోన్‌ కంపెనీలకు భారీగా ముట్టజెప్పడం చివరకు వివాదానికి కారణం అవుతుంది. ఇదే వివాదాస్పదం అవుతుంటే, ఇప్పుడు థర్డ్‌ పార్టీ యాప్‌ స్టోర్‌లతో పాటు, ఏపీకే ఇన్‌స్టాల్స్‌ యాప్స్‌ను సైతం ఇన్‌స్టాల్‌ చేయనివ్వకుండా ఉండేలా కండిషన్స్‌ పెడుతుంది గూగుల్‌. కేవలం ఫోన్ల మార్కెట్‌ప్లేస్‌లో గూగుల్‌​ప్లేస్టోర్‌ మాత్రమే కనిపించేలా ఒప్పొందాలు చేసుకుంటున్నాయి.

అయితే, ఈ ఒప్పొందాలు చీకటి ఒప్పందాలు అంటూ నైతిక విలువలకు విరుద్ధమంటూ కోర్టుకెక్కింది ఎపిక్‌ గేమ్స్‌. కంపెనీలు చీకటి ఒప్పందాల్లో భాగంగా 12 శాతం వాటాలు గూగుల్ నుంచి తీసుకుంటున్నాయని, OEMలో భాగంగా ఒప్పో, వీవో, వన్‌ఫ్లస్‌ 70 శాతం, సోనీ, జియోమీ 50, 40 శాతం గూగుల్‌ ప్రీమియర్‌ డివైజ్‌ ప్రోగ్రామ్‌‌లో భాగమైనట్లుగా కోర్టుకు చెప్పింది ఎపిక్స్.