Google Pixel 10 : ఇది కదా ఆఫర్.. ఈ గూగుల్ పిక్సెల్ 10పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!
Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్. విజయ్ సేల్స్ లో ఇలా కొన్నారంటే ఏకంగా రూ. 8వేలు తగ్గింపు పొందవచ్చు. అసలు ధర నుంచి రూ. 74,999కు కొనేసుకోవచ్చు. ఇంకా తగ్గాలంటే ఇలా చేయండి..
Google Pixel 10
- భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రారంభ ధర రూ. 79,999
- విజయ్ సేల్స్‌లో రూ. 74,999 ధరకు లిస్టింగ్, రూ. 5వేలు నేరుగా తగ్గింపు
- బ్యాంకు ఆఫర్లతో ఈ పిక్సెల్ 10 ఫోన్ మరింత ఆదా చేయొచ్చు
Google Pixel 10 : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీకోసమే. గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఇప్పుడు చౌకైన ధరకే లభిస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 79,999 ప్రారంభ ధరతో లాంచ్ కాగా పిక్సెల్ 10 ఇప్పుడు డిస్కౌంట్ ధరకే లభ్యమవుతోంది.
విజయ్ సేల్స్ వెబ్సైట్లో రూ. 8వేలకు పైగా తగ్గింపుతో కొనేసుకోవచ్చు. ఈ పిక్సెల్ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, పవర్ఫుల్ కెమెరా సెటప్, అనేక ఏఐ ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. ఈ డీల్ పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
గూగుల్ పిక్సెల్ 10 డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ. 79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్సైట్లో ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 74,999కే లభిస్తోంది. దాంతో అసలు ధర నుంచి రూ. 5వేలు నేరుగా తగ్గింపు పొందింది.
అంతేకాదు.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై కొనుగోలుదారులు రూ. 3,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 2వేలు డిస్కౌంట్ పొందవచ్చు.
గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10లో 6.3-అంగుళాల OLED డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ సపోర్టు ఇస్తుంది. ఈ స్క్రీన్కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా ఉంది. పిక్సెల్ 10లో టెన్సర్ G5 ప్రాసెసర్, 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
ఈ పిక్సెల్ ఫోన్ 4,970mAh బ్యాటరీతో వస్తుంది. 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 10లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 10.5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
గూగుల్ పిక్సెల్ 10 కొనాలా? వద్దా? :
గూగుల్ అందించే అడ్వాన్స్ ఫోన్లలో పిక్సెల్ 10 ఫోన్ ఇదొకటి. ఈ ఫోన్లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఛార్జింగ్ స్పీడ్ చాలా నెమ్మదిగా ఉంటుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ పెద్దగా బాగోలేదనే చెప్పాలి. ఎల్టీపీఓ డిస్ప్లే, ప్రీమియంతో వస్తుంది. స్మార్ట్ సాఫ్ట్వేర్ ఫీచర్లు, ఫోటోగ్రఫీ, ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.
