Smart Phone: గూగుల్‌ పిక్సెల్‌ 10 ప్రో ఫోల్డ్ డిజైన్‌ ఎంత అద్భుతంగా ఉందో చూడండి.. కొంటారా? 

గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ నుంచి ఇతర ఫోల్డబుల్ ఫోన్లకు గట్టి పోటీ ఉంటుంది.

గూగుల్‌ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ పిక్సెల్‌ 10 ప్రో ఫోల్డ్ డిజైన్‌ లీకైంది. పిక్సెల్‌ 9 ప్రో ఫోల్డ్‌, పిక్సెల్‌ 10 ప్రో ఫోల్డ్ డిజైన్‌లలో పెద్దగా తేడా కనపడడం లేదు. గత ఏడాది గూగుల్‌ రిలీజ్‌ చేసిన పిక్సెల్‌ 9 ప్రో ఫోల్డ్‌ మోడల్‌ డిజైనే పిక్సెల్‌ 10 ప్రో ఫోల్డ్‌కు వాడినట్లు తెలుస్తోంది.

కెమెరా సెటప్ కూడా ఒకే పరిమాణంలో ఉన్నట్లు కనిపిస్తోంది. సెన్సార్ స్పెసిఫికేషన్‌లు మారకపోవచ్చని తెలుస్తోంది. పిక్సెల్‌ 10 ప్రో ఫోల్డ్‌లోనూ పిక్సెల్‌ 9 ప్రో ఫోల్డ్‌లాగే 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుందని అంచనా.

పిక్సెల్‌ 9ఏ లాగానే పిక్సెల్ 10లోనూ సిమ్ కార్డ్ స్లాట్ స్మార్ట్‌ఫోన్‌కు పైభాగంలో ఉంది. లెఫ్ట్‌ ఎడ్జ్‌లో కొత్త సిమెట్రిక్ కటౌట్‌లు ఉన్నాయి. ఇవి యాంటెన్నా బ్యాండ్‌లు లేదా సిగ్నల్ బూస్టర్‌లుగా పనిచేస్తాయి.

Also Read: రియల్‌మీ నుంచి తక్కువ ధరకు అద్భుతమైన ఫీచర్లతో 2 కొత్త స్మార్ట్‌ఫోన్లు

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ డైమెన్షన్లు 155.2 x 150.4 x 5.3mmగా ఉన్నాయి. గత సంవత్సరం తీసుకొచ్చిన మోడల్ కంటే ఇది కొంచెం ఎక్కువ. హానర్ మ్యాజిక్ V3, OPPO ఫైండ్ N5 వంటి స్మార్ట్‌ఫోన్ల అంత కాకపోయినా పిక్సెల్‌ 10 ప్రో ఫోల్డ్ తక్కువ మందంతోనే వస్తోంది.

మరిన్ని ఫీచర్లు
పిక్సెల్‌ 10 ప్రో ఫోల్డ్‌ గూగుల్ టెన్సర్ G5 చిప్‌తో వస్తోంది. 256GB, 512GB స్టోరేజ్‌ వేరియంట్ ఆప్షన్లతో 16GB RAMతో ఈ స్మార్‌ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఆగస్టులో గూగుల్ మేడ్ బై గూగుల్ ఈవెంట్ సందర్భంగా పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL లతో పాటు పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ధరపై క్లారిటీ లేదు. ఇతర ఫోల్డబుల్ ఫోన్ ధరల కన్నా తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. దీంతో
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ నుంచి ఇతర ఫోల్డబుల్ ఫోన్లకు గట్టి పోటీ ఉంటుంది.