Google Pixel 10 Pro
Google Pixel 10 Pro Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? గూగుల్ నెక్స్ట్ జనరేషన్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లైన పిక్సెల్ 10 సిరీస్ (Google Pixel 10 Pro) త్వరలో ఆవిష్కరించే అవకాశం ఉంది.
ఈ పిక్సెల్ ఫోన్లు ఆగస్టు 2025లో అధికారికంగా లాంచ్ చేయనుంది. అయితే, లీక్‌లు, పుకార్లు ఇప్పటికే ఇంటర్నెట్‌లో లాంచ్ అయ్యాయి. లాంచ్‌కు ముందే స్పెసిఫికేషన్లు, ధరపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ లైనప్‌లో గూగుల్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ అనే 4 మోడళ్లు ఉండవచ్చు. డిస్‌ప్లే, ఆకట్టుకునే కెమెరా, ఇతర ఫీచర్లలో PWM డిమ్మింగ్‌ను లైనప్ పొందుతుందని పుకారు ఉంది. పిక్సెల్ 10 ప్రో అంచనా, లాంచ్ టైమ్‌లైన్ కెమెరా, స్పెసిఫికేషన్లు, ధర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గూగుల్ పిక్సెల్ 10 ప్రో డిజైన్ (అంచనా) :
పిక్సెల్ 10 ప్రో మోడల్ పిక్సెల్ 9 ప్రో మాదిరిగానే ఉంటుందని అంచనా. ఫ్లాట్ ఎడ్జ్‌లు, సిమెట్రిక్ బెజెల్స్, పంచ్-హోల్ ఫ్రంట్ కెమెరాను పొందే అవకాశం ఉంది. హ్యాండ్‌సెట్ ఐకానిక్ రియర్ కెమెరా వైజర్‌ను ఉంచవచ్చు. అయితే, మ్యాట్ ఫినిషింగ్ బదులుగా ఆకర్షణీయమైన ఫ్రేమ్‌ను పొందవచ్చు.
పిక్సెల్ 10 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల అమోల్డ్ LTPO డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశంతో వస్తుందని అంచనా. గీతలు, మరకలు పడకుండా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా పొందవచ్చు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం గూగుల్ TSMC 3 nm-ఆధారిత కొత్త టెన్సర్ G5 చిప్‌సెట్‌ను అందించే అవకాశం ఉంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ పిక్సెల్ ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 48MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, బ్యాక్ ప్యానెల్‌లో 48MP అల్ట్రావైడ్ కెమెరాను పొందవచ్చు. అదనంగా, ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ కావచ్చు. కొన్ని అడ్వాన్స్ ఏఐ ఫీచర్లు, జెమిని ఇంటిగ్రేషన్‌ను కూడా చూడవచ్చు.
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ధర (అంచనా) :
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ధరపై అధికారిక వివరాలు లేనప్పటికీ, కొన్ని నివేదికలు పిక్సెల్ 9 ప్రో ధరతో సమానంగా ఉండవచ్చని సూచించాయి. పిక్సెల్ 9 ప్రో భారత మార్కెట్లో బేస్ వేరియంట్ కోసం దాదాపు రూ. 1,09,999 ధరకు లాంచ్ అయింది.