Google Pixel 11 Pro Fold : శాంసంగ్‌కు గట్టి పోటీ.. గూగుల్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధరపై భారీ అంచనాలు!

Google Pixel 11 Pro Fold : గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్, పిక్సెల్ 11 సిరీస్‌తో 2026 ఆగస్టు 12న మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో లాంచ్ అవుతుందని అంచనా.

Google Pixel 11 Pro Fold

  • గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ధరపై భారీ అంచనాలు
  • పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ లాంచ్ డేట్ ఎప్పుడంటే?
  • మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో ఆగస్టు 12న లాంచ్

Google Pixel 11 Pro Fold : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అతి త్వరలో గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లోని ఇతర ఫోన్‌లతో పాటు ఆగస్టులో లాంచ్ కానుంది. గూగుల్ పిక్సెల్ 11, గూగుల్ పిక్సెల్ 11 ప్రో, గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ ఫోన్లు రాబోతున్నాయి.

ఈ సిరీస్ ఫోన్లు అత్యంత ఆకర్షణీయంగా ఉండనున్నాయి. ప్రస్తుతం మెమరీ ధరల కారణంగా రాబోయే పిక్సెల్ ఫోన్ ధర కాస్త ఎక్కువగా ఉండొచ్చు. ఈ ఫోన్‌కు సంబంధించిన లీకులు, పుకార్లు ఆన్ లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. లీకులు, ఊహాగానాల ఆధారంగా ఈ ఫోన్ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

భారత్‌లో పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ధర, లాంచ్ తేదీ :
256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ 16జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 1,74,999 నుంచి రూ. 1,89,999 మధ్య భారత మార్కెట్లోకి రావచ్చు. అంతేకాదు.. కంపెనీ అధికారిక ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌లో ఈ ఫోన్ ఆగష్టు 12, 2026న లాంచ్ కానుంది. ఇప్పటివరకు, ఈ ఫోన్ కలర్ వేరియంట్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read Also : Vivo Y05e Launch : వావ్.. వివో నుంచి అత్యంత చవకైన కొత్త ఫోన్.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ కెమెరా, స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రావొచ్చు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50ఎంపీ ప్రైమరీ వైడ్ యాంగిల్ కెమెరా, 48ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5x వరకు ఆప్టికల్ జూమ్‌తో 48ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ ఉంటాయి. అంతేకాదు.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ పిక్సెల్ ఫోన్‌లో 10.5ఎంపీ కవర్, 10.5ఎంపీ ఇన్నర్ సెల్ఫీ షూటర్ కూడా ఉండొచ్చు.

పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 6.5-అంగుళాల ఓఎల్ఈడీ లోపల డిస్‌ప్లే, 8.5-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ బయటి డిస్‌ప్లేతో రావచ్చు. 2nm ప్రాసెస్‌తో గూగుల్ టెన్సర్ జీ6 చిప్‌సెట్‌పై కూడా రన్ అవుతుంది.

ఈ మడతబెట్టే ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 4800mAh బ్యాటరీతో పాటు 30W వైర్డ్, 23W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.