గూగుల్ Pixel 4a స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లే స్పెషల్ ఎట్రాక్షన్..!

  • Publish Date - August 4, 2020 / 10:28 AM IST

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి కొత్త ఫిక్సల్ 4a స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. సరికొత్త ఆకర్షణీయమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. గతంలో ఈ ఫోన్ గురించి చాలా వరకు లీక్‌లు వినిపించాయి. ఎట్టకేలకు ఇప్పుడు అధికారికంగా గూగుల్.. మిడ్ రేంజ్ ఫోన్లలో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ Pixel 4aను లాంచ్ చేసింది. గతంలోనే దీనికి సంబంధించి అనేక లీకులు డిజైన్, ఫీచర్లపై ఊహాగానాలు వినిపించాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఉన్న ఐఫోన్ SE 2020, OnePlus NOrdతో పోటీ పడనుంది.. ఈ ఏడాదిలో అక్టోబర్ తరువాత భారత మార్కెట్లో విడుదల కానుంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్‌తో గూగుల్ Pixel 4aను ఒకే మోడల్‌లో విడుదల చేసింది. Pixel 4a 5G వేరియంట్ కూడా ప్రకటించింది. కానీ భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉండదు. అంతేకాదు.. ఇండియాలో ఫోన్ ధరలను కూడా గూగుల్ ఇంకా వెల్లడించలేదు. గూగుల్ Pixel 3aతో పోల్చితే గూగుల్ Pixel తక్కువ ధరకే లాంచ్ అయింది.



గూగుల్ Pixel 4a : ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :

* Display : 5.81-అంగుళాల Full HD+ పంచ్-హోల్ OLED డిస్‌ప్లే 19.5: 9 యాస్పెక్ట్ రేషియో

* Chipset: గూగుల్ పిక్సెల్ మిడ్-రేంజ్ స్నాప్‌డ్రాగన్ 730G చిప్‌సెట్‌

* RAM : సింగిల్ 6GB RAM వేరియంట్‌

* Storage: 6GB RAMతో పాటు, 128GB ఇంటర్నల్ స్టోరేజ్


* Rear Cameras: కెమెరా పరంగా, గూగుల్ పిక్సెల్ 4aలో Square camera ఉంది. 12.2MP డ్యూయల్ పిక్సెల్ ఫేజ్ డిటెక్షన్ వెనుక కెమెరా f / 1.7 ఎపర్చరు, iOS, 77-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ.

* Front Camera: గూగుల్ పిక్సెల్ 4aలో 8MP ఫ్రంట్ కెమెరా f/ 2.0 ఎపర్చరు, 84-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ.

* Battery : గూగుల్ పిక్సెల్ 4aలో 3140 బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది.

గూగుల్ పిక్సెల్ ఫోన్లలో గ్రేట్ కెమెరా స్పెసిఫికేషన్లకు పెట్టింది పేరు.. మార్కెట్‌లోని ఇతర స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా కాకుండా, పిక్సెల్ 4a వెనుక భాగంలో ఎక్కువ కెమెరాలు లేవు. 12.2-MP కెమెరాను కలిగి ఉంది, వీడియో రికార్డింగ్ కోసం 4K 30fps వీడియో రికార్డింగ్, 1080p 120fps రికార్డింగ్ ఫీచర్లను చేర్చాలని కంపెనీ భావించింది.

కెమెరాతో పాటు, గూగుల్ పిక్సెల్ 4a OLED డిస్‌ప్లేతో వస్తుంది. Titan M Security Moduleకు సపోర్టుతో పాటు ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, నౌ ప్లేయింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలో 3140mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందా లేదా అనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.



ధర ఎంతంటే? :
గూగుల్ పిక్సెల్ 4a, Pixel 4a 5G వేరియంట్‌ను ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో ఈ వేరియంట్ రానుంది. రెండు మోడళ్లు యుఎస్, కెనడా, యుకె, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, తైవాన్, ఆస్ట్రేలియాలో అందుబాటులో ఉంటాయి. పిక్సెల్ 4a 5G వేరియంట్ ఇండియాకు రాదనే చెప్పాలి.

గూగుల్ పిక్సెల్ 4a ధర మార్కెట్లో 349 డాలర్లు (రూ.26,228) నుంచి అందుబాటులో ఉండనుంది. 5G వేరియంట్ ధర 449 డాలర్లు (రూ.33,750) ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్‌లో ఇండియాలో అందుబాటులోకి వస్తుంది. కానీ, ఇండియా ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ట్రెండింగ్ వార్తలు