×
Ad

Google Pixel 9 Pro Fold : ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్ అదిరింది.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు.. డోంట్ మిస్!

Google Pixel 9 Pro Fold : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో ధర రూ. 83వేలు తగ్గింది.

Google Pixel 9 Pro Fold

Google Pixel 9 Pro Fold : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సందర్భంగా అనేక రకాల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది.

ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో (Google Pixel 9 Pro Fold) రూ. 83వేల వరకు భారీ తగ్గింపు పొందవచ్చు. ఇంతకీ ఈ ఆఫర్‌ను ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ రూ.1,72,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ రూ.99,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌పై రూ.73వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాదు.. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే అదనంగా రూ.10వేలు తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ ఆదా చేసుకోవచ్చు.

Read Also : Vivo X200 5G Price : వారెవ్వా.. కిర్రాక్ ఆఫర్ భయ్యా.. వివో X200 5G ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ 1080×2424 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల ఓఎల్ఈడీ కవర్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇంకా, స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. పిక్సెల్ 9 ప్రో లోపల 8-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ ఫోల్డింగ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ కూడా కలిగి ఉంది.

ఈ బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌కు గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. పిక్సెల్ మడతబెట్టే ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4650mAh బ్యాటరీతో వస్తుంది. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ యాడ్ మీ, ఆటో ఫ్రేమ్, మ్యాజిక్ లిస్ట్, పిక్సెల్ స్టూడియో, క్లియర్ కాలింగ్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లను కూడా అందిస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. OISతో 48MP ప్రైమరీ కెమెరా, 10.5MP అల్ట్రావైడ్ లెన్స్, 10.8MP టెలిఫోటో లెన్స్ కలిగి ఉంది. లోపల, బయటి డిస్ ప్లే రెండింటిలోనూ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.