×
Ad

Google Pixel 9 Pro : వారెవ్వా.. మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ గూగుల్ పిక్సెల్ 9 ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. అమెజాన్‌లో ఇలా కొనేసుకోండి!

Google Pixel 9 Pro : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో ఏకంగా రూ. 25,850కి తగ్గుతుంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే? ఇప్పుడు తెలుసుకుందాం..

1/5
Google Pixel 9 Pro : కొత్త పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? అయితే ఇది మీకోసమే.. పిక్సెల్ 10 సిరీస్ లాంచ్ అయ్యాక గూగుల్ మునుపటి ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 9 ప్రో ధర అమెజాన్‌లో భారీగా తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ.25,850 కన్నా ఎక్కువ తగ్గింపుతో లభ్యమవుతుంది. దాంతో అసలు ధర రూ.84,200 కన్నా ఎక్కువగా డిస్కౌంట్ అందిస్తోంది.
2/5
ప్రీమియం డిజైన్, గూగుల్ కస్టమ్ టెన్సర్ ప్రాసెసర్, పవర్‌ఫుల్ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో పిక్సెల్ 9 ప్రో అద్భుతమైన వాల్యూను అందిస్తుంది. పూర్తి ధర చెల్లించకుండా ఫ్లాగ్‌షిప్-లెవల్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలి? పిక్సెల్ 9 ప్రో ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
3/5
పిక్సెల్ 9 ప్రో అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో రూ.1,09,999కు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ పిక్సెల్ ఫోన్ ప్రస్తుతం రూ.87,890కు అందుబాటులో ఉంది. రూ.22,109 నేరుగా ధర తగ్గింపు పొందవచ్చు. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3,750 అదనపు తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ మోడల్ కండిషన్ బట్టి రూ.44,300 వరకు ఆదా చేయవచ్చు.
4/5
గూగుల్ పిక్సెల్ 9 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : గూగుల్ పిక్సెల్ 9 ప్రో టెన్సర్ G4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,700mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 6.3-అంగుళాల ఎల్టీపీఓ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. అలాగే, డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది.
5/5
ఆప్టిక్స్ పరంగా గూగుల్ పిక్సెల్ 9 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MPప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్ , 5xఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP కెమెరాను కలిగి ఉంది.