Telugu » Technology » Google Pixel 9a Price Drops By Over 8800 Discount On Amazon Check Deal Details Here Sh
Google Pixel 9a Price : ఇది కదా డిస్కౌంట్.. అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9aపై కిర్రాక్ డిస్కౌంట్.. ఇప్పుడే కొనడం బెటర్..!
Google Pixel 9a Price : గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో దాదాపు రూ. 8,800 డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Google Pixel 9a Price : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? అద్భుతమైన కెమెరా పర్ఫార్మెన్స్‌తో పాటు క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ అందించే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. గూగుల్ పిక్సెల్ 9a అద్భుతమైన ఫీచర్..
2/7
గూగుల్ బడ్జెట్-ఫ్రెండ్లీ పిక్సెల్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 8,800 కన్నా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఆకర్షణీయమైన డిజైన్, సాఫ్ట్‌వేర్ పర్ఫార్మెన్స్‌తో పిక్సెల్ 9a ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 9a డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
గూగుల్ పిక్సెల్ 9a అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9a ధర రూ.49,999కు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.43,690కు లిస్ట్ అయింది. రూ.6,309 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.2,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత సేవింగ్ కోసం మీ పాత హ్యాండ్‌సెట్‌ను కూడా ట్రేడ్ చేయవచ్చు.
4/7
గూగుల్ పిక్సెల్ 9a స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 6.3-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 422.2 PPI వద్ద ఫుల్ HD+ (1080 x 2424 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో అందిస్తుంది.
5/7
అలాగే, డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ స్క్రీన్ HDR కంటెంట్ కోసం 1800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ లెవల్స్ అందిస్తుందని, 2700 నిట్స్ వద్ద గరిష్టంగా ఉంటుందని అంచనా.
6/7
హుడ్ కింద, పిక్సెల్ 9aలో గూగుల్ టెన్సర్ G4 చిప్ కలగి ఉంది. 5100mAh బ్యాటరీ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 9a బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.
7/7
ఇందులో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 13MP కెమెరా కలిగి ఉంది.