Real images of Google Pixel Fold leak online ahead
Google Pixel Fold Leak : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం సొంత బ్రాండ్ పిక్సెల్ బ్రాండ్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ రాబోతోంది. టెక్ కంపెనీ మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను మే 10న జరగనున్న Google I/O ఈవెంట్‌లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. అయితే, అధికారిక ప్రకటనకు ముందే, (Google Pixel) ఫోల్డబుల్ ఫోన్ రియల్ ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
లీకుల ప్రకారం.. మడతబెట్టే పిక్సెల్ ఫోన్ ఫొటోలు నిజమైనవే అని టిప్‌స్టర్ ఆన్‌లైన్‌లో పేర్కొంది. (Tipster Kuba Wojciechowski) తన ట్విట్టర్‌లో పిక్సెల్ ఫోల్డ్ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో 6సెకన్ల నిడివి కలిగి ఉంది. ఆ వీడియోలో సెల్ఫీ కెమెరా, మందపాటి ఇంటర్నల్ బెజెల్‌లు, రౌండ్ షేప్ ఎడ్జ్‌లతో పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ కనిపిస్తోంది. గూగుల్ కెమెరా మాడ్యూల్ లేనప్పటికీ.. ఈ డివైజ్ బెస్ట్ ఫీచర్లతో రానుందని నివేదిక తెలిపింది.
గత లీక్ డేటాను పరిశీలిస్తే.. పిక్సెల్ ఫోల్డ్ దాదాపు 283gms బరువు కలిగి ఉండవచ్చు. మరో పోటీదారు శాంసంగ్ (Samsung Galaxy Z Fold4) కన్నా 20gms బరువు ఉంటుంది. మడత పెట్టినప్పుడు.. పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ 5.5 అంగుళాల ఎత్తు, 3.1 అంగుళాల వెడల్పు, 0.5 అంగుళాల డెప్త్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ డివైజ్ మడత విప్పినప్పుడు కచ్చితమైన కొలతలు ఇప్పటికీ తెలియవు. న్యూయార్క్ సబ్‌వేలో ఈ డివైజ్ వాడుతున్నట్టుగా వీడియోలో కనిపించింది.
Real images of Google Pixel Fold leak online ahead
గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ అయితే అధికారిక ప్రకటన ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతం, ఫోల్డబుల్ మార్కెట్ స్పేస్ శాంసంగ్ ఆధిపత్యంలో కొనసాగుతోంది. Oppo, Tecno కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరాయి. అయితే శాంసంగ్ ఇప్పటికీ తిరుగులేని రారాజుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. పుకార్ల ప్రకారం.. గూగుల్ Pixel ఫోల్డ్‌ను అందుబాటులోకి తీసుకొస్తే.. కొనుగోలుదారులకు ఫోల్డబుల్ ఫోన్లు మరిన్ని అందుబాటులోకి వస్తాయి.
పిక్సెల్ ఫోన్ ధర విషయానికి వస్తే.. (Google Pixel Fold) ఫోన్ చాక్, అబ్సిడియన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అందులో (12GB/256GB) మోడల్ ధర 1,799 డాలర్లు (రూ. 1.47 లక్షలకు పైగా) ఉంటుందని అంచనా. అలాగే, (12GB/512GB) మోడల్ అబ్సిడియన్ కలర్‌లో మాత్రమే వస్తుంది. దీని ధర 1,919 డాలర్లు (రూ. 1.57 లక్షల కన్నా ఎక్కువ) ధరకు అందుబాటులో ఉంటుందని అంచనా.
మీరు పిక్సెల్ ఫోల్డ్ కోసం అడ్వాన్స్ ఆర్డర్ చేస్తే.. ఉచిత పిక్సెల్ వాచ్‌ని కూడా సొంతం చేసుకోవచ్చు. పిక్సెల్ ఫోల్డ్ అడ్వాన్స్ ఆర్డర్‌లు మే 10 నుంచి గూగుల్ స్టోర్‌లో ప్రారంభమవుతాయి. లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ జూన్ 27 నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.