Google Playstore: గూగుల్ ప్లేస్టోర్‌లో సేఫ్‌గా లేని యాప్‌లు 19వేల 300

డిజిటల్ సెక్యూరిటీ కంపెనీ ఎవాస్ట్ 19వేల 300 యాప్‌లు సేఫ్ కాదని గుర్తించింది. ఒక్క గూగుల్ ప్లే స్టోర్ లో మాత్రమే ఇన్ని యాప్ లు ఉన్నట్లు వెల్లడించింది.

Google Playstore Unsafe

Google Playstore: డిజిటల్ సెక్యూరిటీ కంపెనీ ఎవాస్ట్ 19వేల 300 యాప్‌లు సేఫ్ కాదని గుర్తించింది. ఒక్క గూగుల్ ప్లే స్టోర్ లో మాత్రమే ఇన్ని యాప్ లు ఉన్నట్లు వెల్లడించింది. డేటాబేస్‌(ఫైర్‌బేస్‌ అంటారు)లో భద్రతలేని ఇటువంటి యాప్‌ల వల్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ అవడం, దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

గూగుల్‌ ప్లే స్టోర్‌ను సురక్షితంగా భావించే వినియోగదారుల కోసం ఈ సూచనలు ఇచ్చింది. ఇందులో యాప్స్‌ కూడా యూజర్‌ డేటాకు ముప్పు తెచ్చేవే అని గ్రహించడంతో వివరాల్ని గూగుల్‌కు అందజేశామని, తద్వారా యాప్‌ డెవలపర్స్‌ అప్రమత్తం అవుతారని ఆశిస్తున్నట్లు ఎవాస్ట్‌ తెలిపింది.

సాధారణంగా ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో యాప్స్‌(మొబైల్‌-వెబ్‌ యాప్స్‌) డెవలపింగ్‌ కోసం ఫైర్‌బేస్‌ను ఉపయోగిస్తారు డెవలపర్స్‌. ఈ క్రమంలో ఈ డేటాబేస్‌ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ఇతరులకు యాక్సెస్ చేయడానికి వీలుంటుంది. వీటిలోని యాప్స్‌ మిస్‌కాన్‌ఫిగరేషన్‌ వల్ల.. లైఫ్‌స్టైల్‌, వర్కవుట్‌, గేమింగ్‌​, మెయిల్స్‌, ఫుడ్‌ డెలివరీ ఇతరత్ర యాప్‌ల నుంచి డేటా లీక్‌ కావొచ్చు.

ఇది కూడా చదవండి.. Digvijay Singh: మహిళలకు స్థానం కల్పించడంలో ఆర్ఎస్ఎస్.. తాలిబాన్లు సమానమే

యూజర్ల నేమ్స్, అడ్రస్, లొకేషన్ వివరాలు, ఒక్కోసారి పాస్‌వర్డ్‌లు కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది. లక్షా 80వేల 3వందల యాప్స్‌ను గుర్తించిన ఎవాస్ట్‌ థ్రెట్‌ ల్యాబ్‌ రీసెర్చర్స్‌ 10 శాతం అంటే.. 19వేల 300 యాప్స్‌ ఓపెన్‌గా, గుర్తింపులేని డెవలపర్స్‌ నుంచి డేటాను లీక్‌ చేసే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు.