Digvijay Singh: మహిళలకు స్థానం కల్పించడంలో ఆర్ఎస్ఎస్.. తాలిబాన్లు సమానమే

మహిళల విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్).. తాలిబాన్లు  ఒక్కటేనని మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ అంటున్నారు.

Digvijay Singh: మహిళలకు స్థానం కల్పించడంలో ఆర్ఎస్ఎస్.. తాలిబాన్లు సమానమే

Digvijay Singh

Digvijay Singh: మహిళల విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్).. తాలిబాన్లు  ఒక్కటేనని మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ అంటున్నారు. మహిళలకు ఉద్యోగాలు కల్పించే విషయంలో వారిద్దరి వైఖరి ఒకేలా ఉందని విమర్శలకు దిగారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ట్వీట్‌ ద్వారా ‘ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్, తాలిబన్లు వారి ఆలోచనా విధానాన్ని మార్చుకోనంత వరకూ ఇదే నిజమని భావించాల్సి వస్తుంద’ని చెప్పారు.
గతంలో అంటే 2013లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్‌ మాట్లాడినట్లుగా ఉన్న ఓ వీడియోను ప్రస్తావించారు దిగ్విజయ్‌. పెళ్లి అనేది ఒక కాంట్రాక్టు, పెళ్లి అయిన మహిళలు ఇళ్లల్లోనే ఉండాలి. ఇంటి పనులు చూసుకోవాలి అని మోహన్‌ భగవత్‌ చెప్పిన సంగతి గుర్తుచేశారు. అఫ్ఘాన్‌ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదని తాలిబన్లు తేల్చిచెబుతున్నారని వెల్లడించారు.
దిగ్విజయ్‌ ట్వీట్‌ను తప్పుబట్టిన మధ్యప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ..  దిగ్విజయ్‌తో పాటు కాంగ్రెస్‌ నాయకత్వం తాలిబన్ల మద్దతుదారులంటూ ఆరోపణలకు దిగారు.
‘మంత్రులుగా మహిళలు పనికి రారు.. కేవలం జన్మనివ్వడానికే పరిమితం’ అని పేర్కొన్నాడు. తాలిబన్ల అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హషిమి ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మహిళలు మంత్రులు కాలేరు. మెడపై ఏదైనా వస్తువు పెడితే మోయలేరు. మంత్రివర్గంలో మంత్రులు తప్పనిసరి కాదు’ అని పేర్కొన్నాడు తాలిబన్ల అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హషిమి.