Google Play Store : గూగుల్ నిషేధం ఈ రోజు నుంచే.. అన్ని కాల్ రికార్డింగ్ యాప్స్ పనిచేయవు..!

Google Play Store : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆ యాప్స్‌ ఈ రోజు (మే 11) నుంచి పనిచేయవు.

Google Play Store : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆ యాప్స్‌ ఈ రోజు (మే 11) నుంచి పనిచేయవు. గత నెలలోనే అన్ని కాల్ రికార్డింగ్ యాప్స్ ప్లే స్టోర్ నుంచి నిషేధం విధించున్నట్టు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం ప్రకటించిన సంగతి తెలిసిందే. Play Store విధానంలో మార్పు మే 11 నుంచి అమలులోకి వస్తుంది. ఇన్‌బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో వచ్చే ఫోన్‌లలో ఎలాంటి మార్పులు ఉండవు. ఆండ్రాయిడ్ యూజర్ల ప్రైవసీని మరింత పటిష్టం చేయడంలో భాగంగా ఆయా కాల్ రికార్డింగ్ ఫీచర్‌ అప్లికేషన్‌లను నిరోధించడానికి Google కఠినమైన చర్యలు చేపట్టింది. ఇకపై ప్లే స్టోర్‌లో రిమోట్ కాల్ ఆడియో రికార్డింగ్‌ వంటి యాప్స్ యాక్సస్ చేసుకోలేరు. ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లతో సహా Google డెవలపర్ విధానాలను అప్‌డేట్ చేసింది. ఆండ్రాయిడ్ యూజర్ల భద్రత కోసం Google కొత్త Play Store విధానాలలో మార్పులు చేస్తోంది.

ఆండ్రాయిడ్‌లో కాల్ రికార్డింగ్‌ను నిలిపివేయాలని గూగుల్ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఆండ్రాయిడ్ 6లో రియల్ టైం కాల్ రికార్డింగ్‌ను బ్లాక్ చేసింది. అలాగే ఆండ్రాయిడ్ 10తో మైక్రోఫోన్ ద్వారా గూగుల్ ఇన్-కాల్ ఆడియో రికార్డింగ్‌ను డిలీట్ చేసింది. కొన్ని యాప్‌ల్లో ఆండ్రాయిడ్ 10, అంతకంటే ఆపై వెర్షన్‌ డివైజ్‌లలో కాల్ రికార్డింగ్ ఫంక్షనాలిటీ యాక్సెసిబిలిటీ సర్వీస్‌ని యాక్సెస్ చేసుకునే వీలుంది. అమెరికాలో ఎవరిదైనా కాల్ రికార్డింగ్ చేయాలంటే వారి సమ్మతితో మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో అలాంటి చట్టం లేదు. కానీ, దీనిపై చాలావరకు ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే Truecaller వంటి యాప్‌లు ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను అందిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 10తో Google విధించిన పరిమితులను అధిగమించేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. కొత్త కాల్ రికార్డింగ్ పరిమితులు లేటెస్ట్ Android 12-పవర్డ్ ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తాయా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. ఒకవేళ Android 10, Android 11 డివైజ్‌ల్లో కూడా ఈ పరిమితులు వర్తిస్తాయా లేదో చూడాలి.

Google Will Ban All Call Recording Apps From Today

కుపెర్టినో-ఆధారిత టెక్ దిగ్గజం చాలా ఏళ్లుగా కాల్ రికార్డింగ్ యాప్‌లు, సర్వీసులకు వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే కాల్‌లను రికార్డింగ్ చేయడం యూజర్ల ప్రైవసీపై దాడి చేయడమేనని కంపెనీ విశ్వసిస్తోంది. అదే కారణంగా, Google సొంత డయలర్ యాప్‌లోని కాల్ రికార్డింగ్ ఫీచర్ ద్వారా ఏదైనా కాల్ రికార్డు చేసినప్పుడు వార్నింగ్ వాయిస్ వస్తోంది. రికార్డింగ్ ప్రారంభించే ముందు రెండు వైపులా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ మార్పు థర్డ్-పార్టీ యాప్‌లను మాత్రమే ప్రభావితం చేస్తుందని గూగుల్ స్పష్టం చేసింది. మీ డివైజ్‌లోని Google డయలర్‌లో కాల్ రికార్డింగ్ ఇప్పటికీ పని చేస్తుంది. కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో ఏదైనా ప్రీలోడెడ్ డయలర్ యాప్ ఖచ్చితంగా పని చేస్తుంది. Google Play స్టోర్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉన్న యాప్‌లు మాత్రమే పనిచేయవు.

ట్రూకాలర్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌ డిలీట్ :
కాల్ రికార్డింగ్ యాప్‌లను నిషేధిస్తున్నట్లు గూగుల్ ప్రకటించిన ఒక రోజు తర్వాత.. ట్రూకాలర్ తన ప్లాట్‌ఫారమ్ నుండి కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను డిలీట్ చేస్తున్నట్టు వెల్లడించింది. అప్ డేట్ అయిన Google డెవలపర్ ప్రోగ్రామ్ విధానాల ప్రకారం.. ఇకపై కాల్ రికార్డింగ్‌లను అందించలేము. డివైజ్‌లో స్థానికంగా కాల్ రికార్డింగ్‌ని కలిగిన ఫోన్లపై ఎలాంటి ప్రభావం ఉండదని Truecaller ప్రతినిధి తెలిపారు.

Read Also : Google Search Mobile : గూగుల్‌ సెర్చ్‌లో మీ మొబైల్ నంబర్‌ కనిపిస్తుందా? వెంటనే డిలీట్ చేయండిలా..!

ట్రెండింగ్ వార్తలు