మీ ప్రైవసీ ఇక భద్రం : గూగుల్ యూజర్లకు ‘ఆటో డిలీట్’ ఫీచర్ 

ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లకు యూజర్ల ప్రైవసీ డేటా సవాల్ గా మారుతోంది.

  • Publish Date - May 2, 2019 / 10:50 AM IST

ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లకు యూజర్ల ప్రైవసీ డేటా సవాల్ గా మారుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లకు యూజర్ల ప్రైవసీ డేటా సవాల్ గా మారుతోంది. డేటా కలెక్షన్ పాలసీలను మరింత మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ప్రైవసీ అడ్వకేట్లు గూగుల్, ఫేస్ బుక్ లపై ఒత్తిడి తీసుకుస్తున్నారు. ఇప్పటికే యూజర్ల ప్రైవసీ డేటా బహిర్గతం కావడం పట్ల ఫేస్ బుక్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది.

గూగుల్ కూడా ఫేస్ బుక్ తరహాలో తమ యూజర్ల డేటా ప్రైవసీకి సంబంధించి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. యూజర్ల డేటాను తమ సర్వర్లలో స్టోర్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ రెండు ఆన్ లైన్ దిగ్గజాలు యూజర్ల ప్రైవసీపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. అందులో భాగంగానే గూగుల్ తమ యూజర్ల ప్రైవసీ డేటాపై కొత్త కంట్రోల్స్ తీసుకోస్తోంది. గూగుల్ లో యూజర్ల డేటా.. (యూజర్ల జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్) వారి అకౌంట్ యాప్ యాక్టివీటీ ఆధారంగా స్టోర్ అవుతోంది. 

త్వరలో ఆటో-డిలీట్ ఫీచర్ : 
ఇప్పటికే గూగుల్ మై యాప్ యాక్టివిటీకి సంబంధించి ఫీచర్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు గూగుల్.. తమ యూజర్ల ప్రొఫైల్స్ డేటా లొకేషన్, వెబ్ బ్రౌజింగ్ డేటాను ఆటోమాటిక్ గా డిలీట్ చేసుకునేలా త్వరలో కొత్త ఫీచర్ తీసుకోస్తోంది. యూజర్లు తమ డేటాను మూడు నెలలు లేదా 18 నెలల వ్యవధిలో స్టోర్ అయిన డేటాను ఆటో డిలీట్ చేసుకోవచ్చునని బ్లాగ్ పోస్టులో కంపెనీ తెలిపింది. యూజర్ల డేటా ఇన్ఫర్మేషన్ పై మరింత కంట్రోల్ ఉంచేందుకు గూగుల్ అవకాశం ఇచ్చింది. డేటా కలెక్షన్ ప్రొటోకాల్స్ లో మార్పులు చేసి యూజర్లకు తమ ప్రైవసీ డేటాపై కంట్రోల్ పవర్ ఇస్తున్నట్టు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. యూజర్లు తమ ఆన్ లైన్ హిస్టరీని ఏదో ఒక సమయంలో ఆటోమాటిక్ గా డిలీట్ చేసుకోవచ్చు.

3 నెలలు.. లేదంటే 18 నెలలు : 
గూగుల్ కలెక్ట్ చేసిన యూజర్ల డేటాను మూడు నెలల తర్వాత లేదా 18 నెలల వ్యవధి లోపు ఎక్స్ పెయిర్ అయ్యేలా ఆటో డిలీట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అంటే.. గూగుల్ యూజర్ తన జీమెయిల్ అకౌంట్ ద్వారా చేసిన సెర్చ్ ఇన్ఫర్మేషన్, సొంత వెబ్ సైట్లపై ఆన్ లైన్ యాక్టివీటీ (యూట్యూబ్)కి సంబంధించి సమాచారాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ యాప్, ఇన్ స్టాలేషన్, యూసేజ్, ఇన్ఫర్మేషన్.. మొత్తం గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్ పై లోకేషన్ హిస్టరీ ఫీచర్ ద్వారా గూగుల్ యూజర్ సమాచారాన్ని సేకరిస్తుంది. ఇందులో మూడు నెలల డేటాను డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే.. 18 నెలల తర్వాత గూగుల్ యూజర్ డేటాను ఆటోమాటిక్ గా తమ సర్వర్ల నుంచి డిలీట్ చేస్తుంది. 

యూజర్ డేటాను  Auto-Delete చేయాలంటే : 
* ఆటో డిలీట్ ఫీచర్.. గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ లో ఉంటుంది.
* యూజర్ అకౌంట్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయాలి. 
* వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ, లోకేషన్ హిస్టరీ సెక్షన్స్ కనిపిస్తాయి.
* చూజ్ టూ డిలీట్ ఆటోమాటిక్ లీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* ఇక్కడ మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.. ఒకటి మ్యాన్యువల్ డిలీట్ ఆప్షన్ 
* రెండవది 18నెలల తర్వాత డేటా ఆటోడిలీట్ ఆప్షన్
* మూడోవది 3 నెలల తర్వాత డేటా ఆటోమాటిక్ డిలీట్ ఆప్షన్ 
* ఈ మూడు ఆప్షన్లలో ఏది కావాలంటే అది యూజర్లు ఎంపిక చేసుకోవచ్చు. 
* కుడివైపు కింది భాగంలో Next బటన్ క్లిక్ చేయాలి. 
* Confirm బటన్ పై క్లిక్ చేయండి చాలు..