Free Cloud Storage
Free Cloud Storage : డిజిటల్ ఇండియా చొరవలో భాగంగా భారత ప్రభుత్వం డిజిలాకర్‌ను ప్రవేశపెట్టింది. క్లౌడ్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా భారతీయ పౌరులు (Free Cloud Storage) తమ అధికారిక డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో సేఫ్‌గా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే, ఈజీగా యాక్సెస్ చేసి ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. ఫిజికల్ కాపీల మాదిరిగానే డిజిలాకర్ డాక్యుమెంట్లు వ్యాలీడ్ అవుతాయి.
ఇప్పుడు, అదే సర్వీసు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ సొల్యూషన్‌తో కూడా వస్తుంది. వినియోగదారులు తమ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ నుంచి ఫైల్, ఫొటోలు, వీడియోలు మొదలైన వాటిని అప్‌లోడ్ చేసుకోవచ్చు. తద్వారా క్లౌడ్‌లో సురక్షితంగా స్టోర్ చేయవచ్చు. అవసరమైతే కోరుకున్న చోట యాక్సెస్ చేయవచ్చు. ఇంతకీ, డిజిలాకర్ డ్రైవ్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? డేటాను ఎలా స్టోర్ చేయాలి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
డిజిలాకర్ డ్రైవ్ ఏంటి? :
డిజిలాకర్ డ్రైవ్ అనేది యూజర్లు డాక్యుమెంట్లను స్టోర్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్ మాదిరిగానే ఫోన్ లేదా పీసీ నుంచి డేటాను అప్‌లోడ్ చేయొచ్చు. అంతేకాదు, ఆసక్తిగల వినియోగదారులు కొత్త ఫోల్డర్‌లను క్రియేట్ చేసేందుకు ఫొటోలు, డాక్యుమెంట్లు లేదా క్లౌడ్‌లో సురక్షితంగా స్టోర్ చేసేందుకు ఏదైనా అప్‌లోడ్ చేసుకోవచ్చు. కోరుకున్న చోట వాటిని యాక్సెస్ చేయొచ్చు.
డిజిలాకర్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ ఎలా పొందాలి? :
అప్‌లోడ్ చేసిన ఫైల్స్ కోసం మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్లు లేదా ఫైల్‌లపై ఇ-సైన్ చేసే ఆప్షన్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఇతరులతో షేర్ చేయొచ్చు.
ఎంత స్టోరేజీ ఉందంటే? :
డిజిలాకర్ డ్రైవ్ 1GB క్లౌడ్ స్టోరేజీతో వస్తుంది. విస్తరించేందుకు మరో దారిలేదు. అయితే, డిజిలాకర్ డ్రైవ్ ద్వారా అవసరమైన డాక్యుమెంట్లు, ఫైల్స్ మొదలైన వాటిని స్టోర్ చేయొచ్చు. మీ డివైజ్ డేటా బ్యాకప్ లేదా ఫొటో-వీడియో స్టోరేజీగా భావించకూడదు.
డిజిలాకర్‌లో కేవలం అందుబాటులో లేని డాక్యుమెంట్ ఫొటోలు లేదా కొన్ని సర్టిఫికెట్‌లను రిఫరెన్స్ ప్రయోజనాల కోసం స్టోర్ చేసేందుకు మాత్రమే. డ్రైవ్ నుంచి వచ్చే డాక్యుమెంట్లు ఒరిజినల్ డాక్యుమెంట్లుగా పరిగణించరు. అధికారిక డాక్యుమెంట్లుగా కాదు.. కేవలం రిఫరెన్స్‌గా మాత్రమే వీటిని ఉపయోగించవచ్చు.