Indian Mobile Users : 70 లక్షల భారతీయ యూజర్ల మొబైల్ నెంబర్లు బ్లాక్.. మీ నెంబర్ సేఫ్‌గా ఉండాలంటే ఈ తప్పు అసలు చేయొద్దు!

Indian Mobile Users : భారత్‌లో ఆన్‌లైన్ మోసాలు, ఆర్థిక మోసాల పెరుగుదలకు ప్రతిస్పందనగా, ఈ నేరాలకు సంబంధించిన 70 లక్షల మొబైల్ నంబర్‌లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.

Indian Mobile Users : భారత్‌లో రోజురోజుకీ ఆన్‌లైన్ స్కామ్‌లు, ఆర్థిక మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని అనేక మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ మోసాల పెరుగుదల కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది పౌరులు ఈ ఆన్‌లైన్ స్కామ్‌లకు బలైపోతున్నారు. ఇటీవలి నెలల్లో, ఆన్‌లైన్ మోసగాళ్ల చేతుల్లో మోసపోయిన అనేక మంది బాధితులు గణనీయమైన మొత్తంలో డబ్బును, కొన్నిసార్లు లక్షలు, కోట్ల వరకు కూడా పోగొట్టుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

పెరుగుతున్న ఈ సైబర్ ముప్పును ఎదుర్కోవడానికి, సైబర్ క్రైమ్ లేదా ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు రిపోర్టు చేసిన 70 లక్షల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేసినట్టు భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఈ ప్రయత్నాలలో మొబైల్ డివైజ్‌లో ప్రత్యేక ఐడెంటిఫైయర్ అయిన ఐఎంఈఐని బ్లాక్ చేస్తోంది. అనుమానాస్పదంగా ఫ్లాగ్ చేసిన అకౌంట్ల నుంచి విత్‌డ్రా పరిమితులు విధిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా కనిపిస్తోంది.

Read Also : AI Voice Cloning Scam : స్కామర్లతో జాగ్రత్త.. ఈ ఏఐ వాయిస్ క్లోనింగ్ ట్రిక్‌తో సెకన్లలో ఎవరిదైనా ఫేక్ వాయిస్‌లను క్రియేట్ చేయొచ్చు..!

7 మిలియన్ల మొబైల్ కనెక్షన్లు డియాక్టివేషన్ :
ఆర్‌బీఐ, ట్రాయ్, ఎన్‌పీసీఐ, ఐటి మంత్రిత్వ శాఖ అధికారులతో ఇటీవల జరిగిన సమావేశంలో, ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి ఇదే విషయాన్ని లెవనేత్తారు. ఈ తరహా బ్యాంకు అకౌంట్లు, లో బ్యాలెన్స్ నుంచి ఆకస్మాత్తుగా డబ్బులు జమ కావడం వంటివి ఎన్నో అంశాలపై ప్రస్తావించారు. ఆర్థిక రంగంలో పెరుగుతున్న సైబర్ మోసాల ముప్పును ఎదుర్కోవడానికి ఈ దిశగా చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు.

మీటింగ్ సమయంలో, డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నివేదించిన సైబర్ క్రైమ్ లేదా ఆర్థిక మోసంతో సంబంధం ఉన్న 7 మిలియన్ మొబైల్ కనెక్షన్‌లు ఇప్పటివరకు డియాక్టివేట్ చేసినట్టు వివేక్ జోషి చెప్పారు. అయితే, తదుపరి సెషన్ జనవరిలో నిర్వహించాలని స్పీకర్ సూచించినట్టు నివేదిక తెలిపింది.

మీ ఫోన్ నంబర్‌ సేఫ్‌గా ఉండాలంటే? :
మోసపూరిత సిమ్ నంబర్‌లను గుర్తించి ప్రభుత్వం బ్లాక్ చేస్తోంది. ఇలాంటి మోసాల నుంచి మీ ఫోన్ నంబర్‌లు, డివైజ్‌లను ప్రొటెక్ట్ చేసేందుకు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన టిప్స్ పాటించడం ద్వారా మీ వ్యక్తిగత వివరాలను, ఫోన్ నెంబర్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

70 lakh mobile numbers of Indian users

సిమ్ స్వాపింగ్ :
సిమ్ స్వాపింగ్‌లో మోసగాళ్లు మీ మొబైల్ క్యారియర్‌ని వారి కంట్రోల్లోకి తీసుకుంటారు. కొత్త సిమ్ కార్డ్‌కి మీ ఫోన్ నంబర్‌ని మార్చేస్తారు. సోషల్ ఇంజనీరింగ్ ద్వారా లేదా క్యారియర్ భద్రతా వ్యవస్థలలో లోపాలను ఉపయోగించి యాక్సస్ చేస్తారు. మీ నంబర్‌పై కంట్రోల్ పొందిన తర్వాత, పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసేందుకు మీ అకౌంట్లలో అనధికారిక యాక్సెస్‌ని పొందడానికి ఈ ఫోన్ నెంబర్ ఉపయోగించవచ్చు. సిమ్ స్వాపింగ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదైనా సిమ్ కార్డ్ మార్పులను అథెంటికేషన్ చేయడానికి మీ మొబైల్ క్యారియర్‌తో పిన్ లేదా పాస్‌వర్డ్‌ను సెటప్ చేసుకోవడం మర్చిపోవద్దు.

Read Also : SIM Swapping Scam : సిమ్ స్వాపింగ్ స్కామ్‌‌తో జాగ్రత్త.. అసలు ఈ స్కామ్ ఏంటి? మిమ్మల్ని మీరు ఇలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు!

ఫిషింగ్ లింక్స్, మెసేజ్‌లు :
లింక్‌లపై క్లిక్ చేయడం లేదా మెసేజ్‌‌లకు రిప్లయ్ ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా మీ బ్యాంక్, ప్రభుత్వ సంస్థలు లేదా ఇతర విశ్వసనీయ సంస్థల నుంచి వచ్చే లింక్స్, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లాగిన్ వివరాలు లేదా వ్యక్తిగత వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించేందుకు ఫిషింగ్ అటాకర్లు తరచుగా మోసపూరిత మెసేజ్‌లను పంపిస్తుంటారు. ఏదైనా లింక్ క్లిక్ చేసే ముందు మెసేజ్‌ను ధృవీకరించండి. అసురక్షిత ఛానెల్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని అసలు షేర్ చేయరాదు.

వాట్సాప్ మెసేజ్‌లు :
వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించి స్కామర్లు ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఒక స్నేహితుడి నుంచి లేదా కుటుంబ సభ్యుల నంచి వచ్చినట్లు క్లెయిమ్ చేస్తూ మెసేజ్‌లను పంపుతారు. ఆ లింక్‌పై క్లిక్ చేయమని లేదా సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయమని చెబుతుంటారు. అలా పంపినవారి ఐడెంటిటీని ధృవీకరించండి. అనుమానాస్పద మెసేజ్‌‌లను ఓపెన్ చేయొద్దు. అదనపు సెక్యూరిటీ లేయర్ కోసం మీ మెసేజింగ్ యాప్‌లలో టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోండి.

మీ పర్సనల్ డేటాను భద్రపరచుకోండి :
మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడం చాలా కీలకమని గమనించాలి. సందేశాలు లేదా కాల్‌ల ద్వారా పాస్‌వర్డ్‌లు లేదా పిన్‌ల వంటి సున్నితమైన వివరాలను షేర్ చేయడం మానుకోండి. మీరు సోషల్ మీడియాలో షేరింగ్ చేసే సమాచారాన్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే.. స్కామర్‌లు వినియోగదారులను నమ్మించేలా ఫిషింగ్ లింక్స్ కోసం పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటాను ఉపయోగించవచ్చు.

మీ అకౌంట్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి :
మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, మొబైల్ బిల్లులు, ఇతర ఆర్థిక అకౌంట్లపై ఒక కన్నేసి ఉంచండి. మీరు ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీని గమనించినట్లయితే, వెంటనే సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌కు రిపోర్టు చేయండి. సరైన సమయంలో స్పందించడం ద్వారా జరబోయే నష్టాన్ని ముందుగానే నివారించుకునే వీలుంటుంది.

Read Also : Redmi 13C Launch : భారత్‌కు రెడ్‌మి 13C 4G బడ్జెట్ ఫోన్ వస్తోంది.. ఈ తేదీనే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు