Black Friday Sale 2025 : వారెవ్వా.. తగ్గేదేలే.. ఇలా కొన్నారంటే.. ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ అతి చౌకైన ధరకే.. డోంట్ మిస్!
Black Friday Sale 2025 : విజయ్ సేల్స్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ధరలు భారీగా తగ్గాయి. ఈ డీల్స్ ఎలా సొంతం చేసుకోవాలంటే?
Black Friday Sale 2025
Black Friday Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటే ఇప్పుడే కొనేసుకోండి. విజయ్ సేల్స్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా వైడ్ రేంజ్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, టెలివిజన్లు, హోం అప్లియన్సెస్ వంటి అన్ని ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లతో లభ్యమవుతున్నాయి. ఈ సేల్ సమయంలో ముఖ్యంగా అనేక ఐఫోన్ 16 వేరియంట్‌లు భారీ తగ్గింపు ధరకే అందుబాటులో ఉన్నాయి.
డైరెక్ట్ డిస్కౌంట్లతో పాటు రిటైలర్ ఆపిల్ (Black Friday Sale 2025) హ్యాండ్‌సెట్‌లపై బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, అదనపు డీల్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ధరలు సాధారణ మార్కెట్ ధరల కన్నా అత్యంత సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్ :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 మోడల్ 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 79,900కు లాంచ్ అయింది. గత ఏడాదిలో ఐఫోన్ 17 లాంచ్ తర్వాత ఈ ఐఫోన్ 16 ధర రూ. 69,900కి తగ్గింపు పొందింది. విజయ్ సేల్స్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో కస్టమర్లు ఐఫోన్ 16 కొనుగోలుపై 5 శాతం తగ్గింపుతో రూ. 66,490కి సొంతం చేసుకోవచ్చు. అంటే ధర రూ. 3,410 తగ్గింది. ధర తగ్గింపుతో పాటు రిటైలర్ ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పూర్తి లావాదేవీలపై రూ. 4వేలు డిస్కౌంట్ కూడా అందిస్తోంది.
ఇదే ఆఫర్ ఈఎంఐ లావాదేవీలపై కూడా వర్తిస్తుంది. వినియోగదారులు మొత్తం ధరను ముందుగా పేమెంట్ చేయకుండానే ఐఫోన్ 16 కొనేసుకోవచ్చు. IDFC ఫస్ట్ బ్యాంక్, HDFC బ్యాంక్, HSBC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డులపై కూడా భారీ డిస్కౌంట్లు పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ :
ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ 128GB స్టోరేజ్‌తో బేస్ వేరియంట్ ధర రూ. 76,690కి అందుబాటులో ఉంది. సాధారణ ధర రూ. 79,900 ఉండగా దాదాపు 4 శాతం తగ్గింపు, బ్యాంక్ కార్డులు, ఇతర పేమెంట్ ఆఫర్లు కూడా పొందవచ్చు. ఐఫోన్ 16 ప్లస్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ ఐఫోన్ ధర తగ్గింపుపై కస్టమర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. ఫైనల్ డిస్కౌంట్ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పైనే ఆధారపడి ఉంటుంది.
