Starlink India Plans : బిగ్ బ్రేకింగ్.. స్టార్‌లింక్ వస్తోందోచ్.. శాటిలైట్ ఇంటర్నెట్ ప్లాన్లు, స్పీడ్ ఎంత? ధర, లాంచ్ ఎప్పుడంటే? ఫుల్ డిటెయిల్స్..!

Starlink India Plans : ఇంటర్నెట్ యూజర్లు గెట్ రెడీ.. త్వరలోనే భారత్‌లో స్టార్ లింక్ ఇండియా శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు ప్రారంభం కానుంది. లాంచ్ డేట్ పూర్తి వివరాలివే.. !

Starlink India Plans : బిగ్ బ్రేకింగ్.. స్టార్‌లింక్ వస్తోందోచ్.. శాటిలైట్ ఇంటర్నెట్ ప్లాన్లు, స్పీడ్ ఎంత? ధర, లాంచ్ ఎప్పుడంటే? ఫుల్ డిటెయిల్స్..!

Starlink India, Plans

Updated On : November 24, 2025 / 5:56 PM IST

Starlink India Plans : స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వచ్చేస్తోంది. అతి త్వరలోనే భారత్ మార్కెట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంటర్నెట్ సర్వీసు ఉన్నప్పటికీ అంతకన్నా స్పీడ్ అందించే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు అందుబాటులోకి రానుంది. అయితే, ఈ శాటిలైట్ సర్వీసు కేవలం మారుమూల ప్రాంతాల్లోని వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.

స్టార్ లింక్ ఇండియా లాంచ్ (Starlink India Plans) తేదీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో ఎన్ని శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఉండాలి? ఎప్పటినుంచి అందుబాటులోకి రావచ్చు? ఇంటర్నెట్ సర్వీసు స్పీడ్ ఎంత ఉంటుంది? ఇలా పూర్తి వివరాలన్ని తెలుసుకుందాం..

ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి? :
ప్రస్తుతానికి, స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు భారత ప్రభుత్వం నుంచి దాదాపు అన్ని అప్రూవల్స్ వచ్చేశాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ సర్వీసు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి భాగస్వామ్య ఒప్పందాన్ని పొందింది. అయితే, ప్రస్తుతానికి, కొన్ని ఆమోదాలు స్పెక్ట్రమ్ కేటాయింపులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అన్ని ఆమోదాలు పూర్తవుతాయని 2026 మొదటి త్రైమాసికం నాటికి దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also : Black Friday Sale : భలే డిస్కౌంట్ బ్రో.. ఈ శాంసంగ్ ఫోన్‌పై ఏకంగా రూ. 35వేలు తగ్గింపు.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!

లభ్యత విషయానికొస్తే.. :
స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు భారతీయ మార్కెట్లో మారుమూల లేదా సర్వీసులు అందుబాటులో లేని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ సర్వీసుతో పోలిస్తే కొంచెం ఎక్కువ ధర ఉంటుంది. ఇంకా, భారత ప్రభుత్వం స్టార్‌లింక్ కనెక్షన్‌ల సంఖ్యపై గరిష్ట పరిమితిని విధించింది. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు దేశంలో 20లక్షల కన్నా ఎక్కువ కనెక్షన్‌లు ఉండకూడదు.

స్టార్‌లింక్ బేస్ ప్లాన్ ధర ఎంతంటే?:
స్టార్‌లింక్ బేస్ ప్లాన్ దాదాపు 25Mbps స్పీడ్ అందిస్తుందని పుకార్లు ఉన్నాయి. హైస్పీడ్ ప్లాన్ 225Mbps స్పీడ్‌తో అందుబాటులో ఉండవచ్చు. ధర విషయానికి వస్తే.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ రూ. 3,300 ప్రారంభ ధరకు, రూ. 6వేల వరకు ఉండొచ్చు. చాలావరకు హై-స్పీడ్ కనెక్షన్‌లపై సింగిల్ టైమ్ దాదాపు రూ. 30వేలు చెల్లించాల్సి ఉంటుంది.