Harley Davidson new bike: ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోకి హార్లీ డేవిడ్సన్ నుంచి అతి చౌకైన బైక్ వచ్చేసింది. దీని పేరు హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 210. అక్టోబర్ 15 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.హార్లీ డేవిడ్ సన్ X440 ప్రస్తుతం ఉత్తర భారత రాష్ట్రమైన రాజస్థాన్‌లోని నీమ్రానాలో – గార్డెన్ ఫ్యాక్టరీ అని పిలువబడే హీరో మోటో కార్ప్ తయారీ కేంద్రంలో రూపొందుతోంది. కంపెనీ 1 సెప్టెంబర్ 2023 నుంచి ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్ల కోసం టెస్ట్ రైడ్‌లను నిర్వహిస్తోంది.
కొత్త బుకింగ్ విండో అక్టోబర్ 16 నుంచి ప్రారంభించనుంది. వినియోగదారులు కొత్త హార్లీ డేవిడ్ సన్ X440ని అన్ని హార్లీ డేవిడ్ సన్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ అవుట్‌లెట్‌లను ఎంచుకోవచ్చు. www.Harley-Davidsonx440.com ద్వారా కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
జూలై 2023లో ఆవిష్కరించబడినప్పటి నుంచి హార్లీ డేవిడ్ సన్ X440 భారతదేశం అంతటా ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్‌లను ఆకర్షించింది. తద్వారా తన ప్రదర్శన నుంచి కేవలం ఒక నెలలోనే 25000 బుకింగ్‌లను సాధించింది. హీరో మోటోకార్ప్ మొదటి సెట్ కస్టమర్‌లను అందించడానికి ఆన్‌లైన్ బుకింగ్ విండోను తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చింది. మోటార్‌సైకిల్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది – డెనిమ్, వివిడ్, ఎస్. వీటి ధరలకు వరుసగా రూ. 2,39,500/- (డెనిమ్), INR 2,59,500/- (వివిడ్), రూ. 2,79,500/- (S).