Honda Hness CB350 Launch : పండుగ సీజన్‌లో హోండా స్పెషల్ ఎడిషన్ CB350 మోడల్స్.. దిమ్మతిరిగే ఫీచర్లు, ధర ఎంతంటే?

Honda Hness CB350 Launch : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? ఈ 2 హోండా మోటార్‌సైకిళ్లను హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. కస్టమర్ డెలివరీలు త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.

Honda H'ness CB350 Legacy, CB350RS New Hue launched

Honda Hness CB350 Launch : పండుగ సీజన్‌‌లో కొత్త బైక్ కొంటున్నారా? ప్రముఖ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (Scooter India) నుంచి రెండు సరికొత్త (H’ness CB350) లెగసీ, హోండా CB350RS న్యూ హ్యూని వరుసగా రూ. 2,16,356 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ), రూ. 2,19,357 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) వద్ద లాంచ్ చేసింది. పండుగ సీజన్‌లో వాల్యూమ్‌ను పెంచడానికి ప్రత్యేక ఎడిషన్ మోడల్‌లు ప్రవేశపెట్టింది. హోండా మోటార్‌సైకిళ్లను ఇప్పుడు హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు.

Read Also : iPhone 13 Users : ఐఫోన్ 13 యూజర్లకు ఆపిల్ మాజీ ఉద్యోగి వార్నింగ్.. iOS 17 అప్‌డేట్ అసలు డౌన్‌లోడ్ చేసుకోవద్దు..!

త్వరలో దేశవ్యాప్తంగా డెలివరీలు :
కస్టమర్ డెలివరీలు త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. H’ness CB350, CB350RS రెండు మోటార్ సైకిళ్లలో 348.36cc, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, PGM-FI ఇంజిన్‌ను పొందుతాయి. 21.07PS గరిష్ట శక్తిని, 30Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. H’ness CB350 లెగసీ ఎడిషన్, CB350RS న్యూ హ్యూ ఎడిషన్ ఆల్-LED లైటింగ్ సిస్టమ్‌ను (రౌండ్ LED హెడ్‌ల్యాంప్, LED వింకర్స్, LED టైల్యాంప్) పొందాయి.

Honda Hness CB350 Launch

హోండా CB350 మోడల్స్ ఫీచర్లు :
హోండా H’ness CB350 లెగసీ ఎడిషన్‌ను కొత్త పెరల్ సైరన్ బ్లూ కలర్ స్కీమ్‌లో అందిస్తోంది. కొత్త బాడీ గ్రాఫిక్స్, ఇంధన ట్యాంక్‌పై ‘లెగసీ ఎడిషన్’ బ్యాడ్జ్‌ను పొందింది. 1970 నాటి పాత CB350 నుంచి ప్రేరణ పొందింది. CB350RS న్యూ హ్యూ ఎడిషన్‌లో స్పోర్ట్స్ రెడ్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ పెయింట్ స్కీమ్‌లు ట్యాంక్ గ్రాఫిక్స్, రెండు చక్రాలు, ఫెండర్‌లపై షాడోలు ఉన్నాయి.

బాడీ-కలర్ రియర్ గ్రాబ్ హ్యాండిల్స్, హెడ్‌లైట్ కవర్‌ను కూడా అందిస్తుంది. H’ness CB350, CB350RS కొత్త ప్రత్యేక ఎడిషన్లు హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ (HSVCS)తో అధునాతన డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉన్నాయి. రెండు మోటార్‌సైకిళ్లు కూడా అసిస్ట్ స్లిప్పర్ క్లచ్‌తో అమర్చి ఉన్నాయి. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి.

Read Also : Redmi Phones Discounts : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ 3 ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!