Honor Magic 7 Series Launch Date Set for October 30
Honor Magic 7 Series Launch : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హానర్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. హానర్ మ్యాజిక్ 6 లైనప్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా హానర్ మ్యాజిక్ 7 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. కంపెనీ ఫోన్‌ల లాంచ్ తేదీని కూడా ప్రకటించింది.
అయితే, ఫోన్ కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే, చిప్‌సెట్, బిల్డ్ వివరాలకు సంబంధించిన వివరాలు ఇటీవల ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ సిరీస్ బేస్ ప్రో వేరియంట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. హానర్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత మ్యాజిక్ఓఎస్ 9.0ని ఈ నెలలో కూడా ఆవిష్కరించనుంది. ముఖ్యంగా, అక్టోబర్ 16న హానర్ కంపెనీ హానర్ X60 సిరీస్, హానర్ టాబ్లెట్ జీటీ ప్రోని లాంచ్ చేయనుంది.
హానర్ మ్యాజిక్ 7 సిరీస్, హానర్ మ్యాజిక్ఓఎస్ 9.0 లాంచ్ :
అక్టోబర్ 30న చైనాలో హానర్ మ్యాజిక్ 7 సిరీస్ లాంచ్ అవుతుందని హానర్ వీబో పోస్ట్‌లో ధృవీకరించింది. అదే ప్రమోషనల్ పోస్ట్‌లో ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రాబోయే యూఐ స్కిన్ అయిన మ్యాజిక్ ఓఎస్ 9.0ని అక్టోబర్ 23న ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మ్యాజిక్ 7 సిరీస్ హ్యాండ్‌సెట్‌లు మ్యాజిక్‌ఓఎస్ 9.0తో వస్తుందని సూచిస్తుంది. హానర్ మ్యాజిక్ 7 లైనప్ లేదా మ్యాజిక్ ఓఎస్ 9.0 స్కిన్ గురించి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. లాంచ్‌కు ముందు రోజులలో పూర్తివివరాలను రివీల్ చేసే అవకాశం ఉంది.
హానర్ మ్యాజిక్ 7ప్రో స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
హానర్ మ్యాజిక్ 7 సిరీస్ ఈ ఏడాది జనవరిలో చైనాలో ప్రవేశపెట్టిన గత మ్యాజిక్ 6 లైనప్ మాదిరిగానే వనిల్లా మోడల్, ప్రో వేరియంట్‌తో రావచ్చు. మ్యాజిక్ 7 ప్రో హ్యాండ్‌సెట్ లీకైన స్పెసిఫికేషన్‌లు ఇటీవల ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫోన్ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 4 ఎస్ఓసీని పొందవచ్చు. హానర్ మ్యాజిక్ 7 సిరీస్ ప్రో వేరియంట్ 6.82-అంగుళాల 2కె డ్యూయల్-లేయర్ ఓఎల్ఈడీ స్క్రీన్‌తో క్వాడ్-కర్వ్డ్ ఎడ్జ్‌లు, 120Hz రిఫ్రెష్ రేట్, కున్‌లున్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉండవచ్చు. హానర్ ఐ ప్రొటెక్షన్ 3.0, 8టీ ఎల్‌టీపీఓ టెక్నాలజీకి సపోర్టు అందిస్తుంది.
కెమెరా విభాగంలో హానర్ మ్యాజిక్ 7 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రావచ్చు. ఇందులో 50ఎంపీ ఓమ్నివిజన్ ఓవీ50హెచ్ ప్రైమరీ సెన్సార్, 50ఎంపీ అల్ట్రావైడ్ షూటర్ ఉన్నాయి. మూడో బ్యాక్ కెమెరా యూనిట్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో కూడిన 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 సెన్సార్ లేదా 200ఎంపీ శాంసంగ్ ఐఎస్ఓసీఈఎల్ఎల్ హెచ్‌పీ3 సెన్సార్ కావచ్చు.
ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్ 3డీ డెప్త్ సెన్సార్‌తో పాటు 50ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉండవచ్చు. హానర్ మ్యాజిక్ 7 ప్రో 100డబ్ల్యూ వైర్డు, 66డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వస్తుంది. 5,800mAh బ్యాటరీ కూడా సపోర్టు ఇస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2డి ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను పొందవచ్చు. దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ68 లేదా ఐపీ69-రేటెడ్ బిల్డ్‌తో రావచ్చు.
Read Also : World Billionaire Rankings : ప్రపంచ బిలియనీర్ల ర్యాంకులు ఎందుకు మారుతాయంటే? అసలు కారణాలివే!