Honor Magic Vs 2, Watch 4 Pro Launch Date Set For October 12, All Details in Telugu
Honor Magic Watch 4 Pro : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? హానర్ నుంచి ఫోన్, స్మార్ట్‌వాచ్ త్వరలో భారత మార్కెట్లోకి రానున్నాయి. అందులో హానర్ మ్యాజిక్ Vs 2 (Honor Magic Vs 2) ఫోల్డబుల్ ఫోన్ ఇటీవల చైనా 3C సర్టిఫికేషన్ సైట్‌లో లిస్టు అయిందని రిపోర్టు చేసింది. 2023 ఏడాది ఫిబ్రవరిలో స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023లో ఆవిష్కరించిన హానర్ మ్యాజిక్ Vs ఫోల్డబుల్ సక్సస్ అవుతుందని భావిస్తున్నారు.
హానర్ (Honor) ఇప్పుడు (Honor Magic Vs 2 Launch) లాంచ్ తేదీని ప్రకటించింది. అదే రోజు (Honor Watch 4 Pro) లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. స్మార్ట్ వేరబుల్ హానర్ వాచ్ 4 జూలైలో చైనాలో ప్రవేశపెట్టింది. అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
అక్టోబర్ 12న చైనాలో లాంచ్ :
హానర్ కంపెనీ షేర్ చేసిన (Weibo) పోస్ట్ ప్రకారం.. హానర్ మ్యాజిక్ Vs 2, హానర్ వాచ్ 4 ప్రో అక్టోబర్ 12న చైనాలో లాంచ్ కానున్నాయి. కంపెనీ ప్రొడక్టుల గురించి గ్లోబల్ లాంచ్ గురించి మరిన్ని వివరాలను ఇంకా వెల్లడించలేదు. లాంచ్‌కు ముందు రోజుల్లో పూర్తివివరాలను తెలుసుకోవచ్చు.
Honor Magic Watch 4 Pro Launch Date Telugu
ఇంతలో, ఇటీవలి గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో మోడల్ నంబర్ (VER-AN00)తో కూడిన హానర్ హ్యాండ్‌సెట్, Magic Vs 2గా రానుంది. 16GB RAMతో Qualcomm Snapdragon 8+ Gen 1 SoCతో గుర్తించవచ్చు. గత 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లిస్టింగ్‌లో ఈ హానర్ ఫోన్ VCA-AN00 ఇదే మోడల్ నంబర్‌తో కనిపించింది. ఈ హానర్ ఫోల్డబుల్ ఫోన్ ఆండ్రాయిడ్ 13తో రావచ్చు.
హానర్ మ్యాజిక్ Vs 2 కెమెరా ఫీచర్లు (అంచనా) :
హానర్ టీజర్ ప్రకారం.. ఇమేజ్ మ్యాజిక్ Vs 2 ఫోన్ 50MP ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంటుందని సూచిస్తుంది. ఈ ఫోన్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో సెకండరీ 50MP సెన్సార్‌ను, హానర్ మ్యాజిక్ Vs వంటి 8MP 3x టెలిఫోటో కెమెరాను కూడా అందించవచ్చు. మ్యాజిక్ Vs 2 గత మోడల్ కన్నా సన్నగా తేలికగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. హానర్ వాచ్ 4 ప్రో క్లాసిక్స్ టెక్నాలజీతో త్వరలో భారత మార్కెట్లో వాచ్ 4 ప్రో లాంచ్ కానుంది.
Read Also : Tech Tips in Telugu : గూగుల్ సెర్చ్‌లో మీ పర్సనల్ డేటాను ఎలా తొలగించాలో తెలుసా? ఇదిగో సింపుల్ గైడ్ మీకోసం..!