తొలి ఫ్రెంట్ స్ర్కీన్ సెల్ఫీ కెమెరా : హానర్ ‘వ్యూ 20’ వచ్చేస్తోంది!  

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువాయి సబ్ బ్రాండ్ ‘హానర్’ మొబైల్ కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అదే.. హానర్ వ్యూ 20. ప్రపంచ ఫస్ట్ పంచ్ హోల్ డిసిప్లే ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. జనవరి 29న భారత్ మార్కెట్లలోకి ఈ స్మార్ట్ ఫోన్ విడుదల చేయనున్నారు.

  • Publish Date - January 14, 2019 / 10:13 AM IST

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువాయి సబ్ బ్రాండ్ ‘హానర్’ మొబైల్ కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అదే.. హానర్ వ్యూ 20. ప్రపంచ ఫస్ట్ పంచ్ హోల్ డిసిప్లే ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. జనవరి 29న భారత్ మార్కెట్లలోకి ఈ స్మార్ట్ ఫోన్ విడుదల చేయనున్నారు.

  • జనవరి 29 భారత మార్కెట్లోకి విడుదల.. 

  • అమెజాన్ ఇండియాలో ఈ నెల 15 నుంచి ఫ్రీ బుకింగ్ ప్రారంభం

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువాయి సబ్ బ్రాండ్ ‘హానర్’ మొబైల్ కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అదే.. హానర్ వ్యూ 20. ప్రపంచ ఫస్ట్ పంచ్ హోల్ డిసిప్లే ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. జనవరి 29న భారత్ మార్కెట్లలోకి ఈ స్మార్ట్ ఫోన్ విడుదల చేయనున్నారు. ప్రముఖ ఆన్ లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో ఈ నెల 15 నుంచి హానర్ వ్యూ 20 స్మార్ట్ ఫోన్లు ఫ్రీ బుకింగ్ ప్రారంభం కానుంది. గత ఏడాది డిసెంబర్ లో హాంగ్ కాంగ్ లో జరిగిన హానర్స్ ఆర్టోలాజీ ఈవెంట్ లో స్మార్ట్ ఫోన్ వ్యూ 20 విడుదలపై హానర్ కంపెనీ ప్రకటన చేసింది. Honor v20 స్మార్ట్ ఫోన్లో అద్భుతమైన ఫీచర్లు యూజర్లను ఆకర్షించేలా ఉన్నాయి. 48 మెగా ఫిక్సల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ మాత్రమే కాదు.. 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిసిప్లే ఉండటమే ఈ ఫోన్ ప్రత్యేకత. ప్రపంచ తొలి టెక్నాలజీ ఫోన్లలో ఎనిమిదొవ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ గా హానర్ కంపెనీ పేర్కొంది. 

ధర ఎంతంటే..?
ఇందులో 1.4జీబీపీఎస్ సీఏటీ21. మోడమ్ తో పాటు డిసిప్లే ఏరియాలోనే ఫ్రంట్ కెమెరా 18 లేయర్ టెక్నాలజీతో అద్భుతంగా డిజైన్ చేశారు. మొబైల్ ఫ్రంట్ ఎటుచూసిన అన్ని ఎడ్జుల్లో స్ర్కీన్ మాత్రమే కనిపించేలా సరికొత్తగా రూపొందించారు. వ్యూ 20 ఫోన్.. బ్లూ, రెడ్, బ్లాక్ వంటి పలు రకాల రంగుల్లో మార్కెట్లో లభ్యం కానుంది. హానర్ న్యూ మ్యాజిక్ యుఐ 2.0 అటోప్ ఆండ్రాయిడ్ 9.0పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇంతకీ హానర్ వ్యూ 20 ధర ఎంతో చెప్పలేదు కదూ.. ధర రూ. 40వేలు.

రైట్ సైడ్ ఎడ్జ్ వాల్యూమ్ రాకర్, పవర్ బటన్, డ్యుయల్ సిమ్ ట్రే లెఫ్ట్ ప్యానెల్ అంతేకాదు.. మరెన్నో ఫీచర్లు ఆకట్టుకొనేలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సర్ కూడా ఉంది. సింగల్ లౌడ్ స్పికర్, ప్రైమరీ మైక్రోఫోన్, 40 వాట్స్ ఫాస్ట్ చార్జర్, యూఎస్ బీ టైప్ సి పోర్ట్ కేబుల్ కూడా ఉంది. ఈ డివైజ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంప్యూటింగ్ పవర్ గ్రాఫిక్స్ ప్రాసిసెర్ తో పాటు డ్యుయల్ ఐఎస్ పీ, డ్యుయల్ ఎన్ పీయు, హువాయి కిరిన్ 980 చిప్ సెట్ టెక్నాలజీ జోడించారు.

మరికొన్ని ఫీచర్లు ఇవే.. 
– 6జీబీ ర్యామ్ , కిరిన్ 980 ప్రాసిసెర్  
– ఇంటర్నల్ స్టోరేజీ 128 జీబీ 
– నాన్ రిమూవ్బుల్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
– 8జీబీ ర్యామ్ – 128 జీబీ స్టోరేజీ 
– 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ
– బ్లూటూత్ v5.0 
– 
వై-ఫై 802.11 a/b/n/ac, GPS/A-GPS, GLONASS