Honor X7b Launch : 108 ట్రిపుల్ కెమెరాలతో హానర్ ఎక్స్7బీ ఫోన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే..!

Honor X7b Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? 108 ట్రిపుల్ కెమెరాలతో హానర్ నుంచి సరికొత్త ఎక్స్‌7బీ ఫోన్ వచ్చేసింది. ధర, ఫీచర్లకు సంబంధించిన వివరాల గురించి పరిశీలిద్దాం.

Honor X7b With Snapdragon 680 SoC, 108-Megapixel Triple Rear Camera Setup Launched

Honor X7b Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హానర్ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. హానర్ ఎక్స్7బీ లేటెస్ట్ సరసమైన స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా మ్యాజిక్ఓఎస్ 7.2పై రన్ అవుతుంది.

Read Also : Redmi K70 Series Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 50ఎంపీ కెమెరాతో రెడ్‌మి కె70 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

అంతేకాదు.. 6.8-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. హానర్ ఎక్స్7బీ గరిష్టంగా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో అందుబాటులో ఉంది. 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అలాగే, ఈ ఫోన్ ఛార్జర్‌తో 35డబ్ల్యూ వద్ద ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

హానర్ ఎక్స్7బీ ధర ఎంతంటే? :
హానర్ ఎక్స్7బీ ఫోన్ ధర 249 డాలర్లుగా నిర్ణయించింది. ఈ హ్యాండ్‌సెట్ ఎమరాల్డ్ గ్రీన్, ఫ్లోయింగ్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో హానర్ ఎక్స్7బీని ప్రారంభించే ప్లాన్లపై కంపెనీ నుంచి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.

హానర్ ఎక్స్7బీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
డ్యూయల్ సిమ్ (నానో) హానర్ ఎక్స్7బీ మోడల్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,412 పిక్సెల్‌లు) టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Honor X7b Triple Rear Camera Launch

ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ వరకు ర్యామ్‌తో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్ ద్వారా పవర్ అందిస్తుంది. ఫోటోలు, వీడియోలకు హానర్ ఎక్స్7బీ 108ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఎఫ్/1.75 ఎపర్చరుతో, 5ఎంపీ వైడ్ యాంగిల్-కెమెరాతో ఎఫ్/2.2 ఎపర్చరుతో 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఎఫ్‌/2.4తో ఎపర్చరు వస్తుంది. 8ఎంపీ రిజల్యూషన్, ఎఫ్/2.0 ఎపర్చర్‌తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

మీరు హానర్ ఎక్స్7బీలో 128జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని పొందవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ (మోడల్) ఉన్నాయి. 2.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ డేటా బదిలీల కోసం యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ 35డబ్ల్యూ హానర్ సూపర్‌ఛార్జ్ సపోర్ట్‌తో 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని కొలతలు 166.7×76.5×8.24ఎమ్ఎమ్, బరువు 199గ్రాములు ఉంటుంది.

Read Also : Apple Watch Series 9 : ఆపిల్ కొత్త జనరేషన్ స్మార్ట్‌వాచ్ ఇదిగో.. రెడ్ కలర్ వాచ్ సిరీస్ 9 చూశారా? ధర ఎంతంటే?