Indian Whatsapp users deleted app : మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటనతో వాట్సాప్ ను తమ ఫోన్లో నుంచి యూజర్లు డిలీట్ చేసేస్తున్నారు. ప్రైవసీ రిస్క్ ఉందనే కారణంతో యూజర్లు వాట్సాప్ వాడేందుకు ఇష్టపడటం లేదు. ప్రత్యేకించి ఇండియన్ వాట్సాప్ యూజర్లు ప్రత్యామ్నాయ యాప్ ల వైపు స్విచ్ అయిపోతున్నారు. సిగ్నల్, టెలిగ్రామ్‌లను వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటన తర్వాత ఎంత మంది ఇండియన్స్ వాట్సాప్‌ను డిలీట్ చేశారో తెలుసుకోవాలని లోకల్‌సర్కిల్స్ ఓ సర్వే నిర్వహించింది.
ఈ ఆన్‌లైన్ సర్వేలో దేశవ్యాప్తంగా మొత్తం 17 వేల మంది పాల్గొన్నారు. ఇప్పటి వరకూ 5 శాతం మంది ఇండియన్స్ వాట్సాప్‌ను డిలీట్ చేసినట్లు తేలింది. ఇండియాలో మొత్తం వాట్సాప్ యూజర్ల సంఖ్య 40 కోట్లు మంది ఉన్నారు. సుమారు 2 కోట్ల మంది తమ వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేసి ఉంటారని అంచనా. 21 శాతం మంది వాట్సాప్ వాడకాన్ని తగ్గించేశారు. ప్రత్యామ్నాయంగా సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్ లను వాడేస్తున్నారు. మరో 22 శాతం మంది వాట్సాప్ వాడకాన్ని పూర్తిగా తగ్గించామని అంటున్నారు.
వాట్సాప్ కంటే వాట్సాప్ పేకు ఈ కొత్త ప్రైవసీ పాలసీ ఎఫెక్ట్ పడింది. వాట్సాప్ డేటాను ఫేస్‌బుక్, ఇతర థర్డ్ పార్టీలతో షేర్ చేస్తే.. యాప్ వాడేది లేదని యూజర్లు సర్వేలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 92 శాతం మంది ఇదే విషయాన్ని చెప్పారు. 79 శాతం మంది వాట్సాప్ బిజినెస్‌ను వాడటం ఆపేస్తామని చెప్పారు. 55 శాతం మంది వాట్సాప్ ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్టు తెలిపారు.