Android device
ఆండ్రాయిడ్ ఫోన్2లో వద్దనుకున్న యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేస్తారు. ఇక అక్కడితో అయిపోయిందనుకోవద్దు. అది మీ అకౌంట్‌లోనే ఉంటుంది. ఉండిపోతే ఏదో నష్టం ఉందని కాదు. కాకపోతే మీరు ఏ యాప్ వాడారో.. ఇతరులు తెలుసుకోవడం ఇట్టే సులువైపోతుంది. లేదా మీరే పాత యాప్‌ను రీ ఇన్‌స్టాల్ చేసుకోవాలనిపిస్తే.. ఎక్కడ ఉంటుందో తెలుసా..
→ మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Play store ఓపెన్ చేయండి.
→ స్క్రీన్‌లో కుడివైపు ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయండి. అప్పుడొక మెనూ వస్తుంది. అందులో My apps & games మీద నొక్కండి.
→ అక్కడ నాలుగు ఆప్షన్‌లు Updates, Installed, Library, Beta కనిపిస్తాయి.
→ Library మీద క్లిక్ చేస్తే మీరు ఆ Google accountతో ఎప్పుడు ఏ యాప్ వాడారో అన్నీ వివరాలు వచ్చేస్తాయి.
→ అక్కడ ఉన్న Install బటన్ మీద నొక్కితే రీ ఇన్‌స్టాల్ అవుతుంది. లేదంటే అక్కడే ఉన్న’×’ మీద నొక్కితే శాశ్వతంగా క్లోజ్ అయిపోతుంది.
మరింకెందుకు ఆలస్యం.. మీ ఫోన్‌లో గ్యాప్ కోసం cachesని క్లియర్ చేసుకోవడంతో పాటు ఈ యాప్ సమాచారాన్ని కూడా తుడిచిపెట్టేయండి.