×
Ad

Block Promotional Calls : ప్రమోషనల్ ఫోన్ కాల్స్‌తో విసిగిపోయారా? ఇలా సింపుల్‌గా బ్లాక్ చేసేయండి.. అది ఎలాగంటే?

Block Promotional Calls : బ్యాంకులు సహా ఇతర మార్కెటింగ్ నుంచి ఫోన్ కాల్స్ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్ ద్వారా బ్లాక్ చేయొచ్చు..

Block Promotional Calls

Block Promotional Calls : మీకు పదేపదే మార్కెటింగ్ ప్రమోషనల్ ఫోన్ కాల్స్ వస్తున్నాయా? ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఫోన్ నెంబర్ నుంచి ఇలాంటి ప్రమోషనల్ ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఇది ప్రతి మొబైల్ యూజర్‌కు ఎదురయ్యే అనుభవం. అయితే, కొన్నిసార్లు ఏదైనా బిజీగా ఉన్న సమయంలో బ్యాంకు ప్రమోషనల్ కాల్స్ వంటివి చిరాకు తెప్పిస్తుంటాయి.

ఏదో ముఖ్యమైన కాల్ అయి ఉండొచ్చుని ఫోన్ కాల్ ఆన్సర్ చేస్తే అనవసరమైన ఆఫర్ల పేరుతో విసిగిస్తుంటారు. ఈ తరహా ఫోన్ కాల్స్ మీకూ కూడా అదేపనిగా వస్తున్నాయా? అయితే, వీటికి ఎలా చెక్ పెట్టాలో తెలియక అనేక మంది మొబైల్ వినియోగదారులు ఆందోళన చెందుతుంటారు. మీరు ఇలా చేశారంటే మీకు మళ్లీ ప్రమోషనల్ ఫోన్ కాల్స్ రానేరావు.. మీరు చేయాల్సిందిల్లా ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుంది..

బ్యాంక్‌ లేదా కస్టమర్ సర్వీసును సంప్రదించండి :
మీ బ్యాంక్‌ మార్కెట్ స్టాఫ్ నుంచి అదేపనిగా కాల్స్ వస్తున్నాయా? వెంటనే ఆయా బ్యాంకు కస్టమర్‌కేర్‌ సర్వీసుకు కాల్‌ చేయండి. లేదంటే మీకు దగ్గరలోని బ్రాంచ్‌కి వెళ్లండి. ‘Update Your preferences’ మార్చమని అడగండి. ‘మార్కెటింగ్‌ కమ్యూనికేషన్‌’ ఆప్షన్ ఎనేబుల్ ఉంటే వెంటనే అది డిజేబుల్ చేయమని అడగండి.

టెలికం కంపెనీల యాప్‌ :
టెలికామ్‌ కంపెనీలకు అధికారిక యాప్‌ ఉంటుంది. మై జియో, ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌, Vi యాప్‌ ప్రతి ఒక్క నెట్‌వర్క్ కంపెనీకి ఒక యాప్ ఉంటుంది. ఇందులో DND సెట్టింగ్స్‌కు వెళ్లి ప్రిఫరెన్స్‌ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది. ఇక మీకు ప్రమోషనల్‌ కాల్స్‌ అసలు రావు.

అధికారిక వెబ్‌సైట్‌ :

  • బ్యాంక్‌ వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా ప్రమోషనల్ కాల్స్ బ్లాక్ చేయొచ్చు.
  • కమ్యూనికేషన్‌ ప్రిఫరెన్సెస్‌, ప్రొఫైల్‌ Settings వెళ్లండి.
  • మార్కెటింగ్‌, ప్రమోషనల్‌ ఇ-మెయిల్స్‌, SMS, కాల్స్‌ ఆప్షన్‌ డిజేబుల్‌ చేయండి.
  • అనవసరపు ఫోన్ కాల్స్‌ కంట్రోల్ చేయొచ్చు.

ట్రాయ్‌కు ఫిర్యాదు చేయండి :
DND ఆప్షన్‌ యాక్టివేట్‌ చేశారా? అయినా కాల్స్‌ వస్తున్నాయా? 1909కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయండి. అధికారిక (https://www.nccptrai.gov.in) వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయండి.

Read Also : Motorola G85 : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. మోటోరోలా G85 భారీగా తగ్గిందోచ్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ రాదు భయ్యా..!

SMS ద్వారా బ్లాకింగ్ :
మీరు ముందుగా START 0 అని టైప్‌ చేయాలి. ఆ తర్వాత ఆ మెసేజ్ 1909కి SMS చేయాలి. అన్ని మార్కెటింగ్ సంస్థల నుంచి ఎలాంటి ప్రమోషనల్‌ కాల్స్‌ రావు. ఇలా చేస్తే.. మీకు అవసరమైన బ్యాంక్‌ లావాదేవీల మెసేజ్‌లు కూడా రావు.

మాన్యువల్‌ నంబర్‌ బ్లాకింగ్‌ :
మీరు DND సెట్టింగ్స్‌ యాక్టివేట్‌ చేశారా? అయినా అవసరంలేని ఫోన్ కాల్స్ వస్తున్నాయా? మీ ఫోన్‌లో కాల్‌ బ్లాకింగ్‌ ఫీచర్‌ ఎనేబుల్ చేయండి. ట్రూకాలర్‌, కాల్‌ బ్లాకర్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్స్ వాడండి. స్పామ్‌, బ్యాంక్‌ మార్కెటింగ్‌ కాల్స్‌ ఆటో బ్లాక్ చేస్తాయి. ఒకసారి కాల్‌ వచ్చినప్పుడు ‘మార్క్‌ కాల్స్ యాజ్‌ స్పామ్‌’ ఆప్షన్‌ ఎంచుకుంటే సరి.. ఆ తర్వాత అలాంటి నెంబర్ల నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్‌ రావు. ఒకవేళ వచ్చినా వెంటనే బ్లాక్ అవుతాయి.

DND ఆప్షన్ యాక్టివేట్‌ :
మీకు పదేపదే ప్రమోషనల్‌, మార్కెటింగ్‌ ఫోన్‌కాల్స్‌ వస్తుంటే వెంటనే మీ ఫోన్‌ నెంబర్‌పై DND ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. 3 విధాలుగా ఈ DND ఆప్షన్ ఎనేబుల్‌ చేసుకోవచ్చు.

ట్రాయ్‌ DND వెబ్‌సైట్‌ :
ట్రాయ్‌ డీఎన్‌డీ వెబ్‌సైట్‌ (https://www.dndcheck.co.in/)కి వెళ్లండి. ‘నేషనల్‌ డునాట్‌ కాల్‌ రిజిస్టరీ’లో రిజిస్టర్‌ చేసుకోండి. తద్వారా మీకు ప్రమోషనల్‌ కాల్స్‌ రానేరావు.