Samsung Galaxy S24 : వారెవ్వా.. ఆఫర్ అదిరింది బ్రో.. శాంసంగ్ లవర్స్‌కు పర్ఫెక్ట్ స్మార్ట్‌ఫోన్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ దొరకదు!
Samsung Galaxy S24 Price : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ S24 ధర తగ్గింది. రూ. 40వేల కన్నా డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S24 Price : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ S24 ధర భారీగా తగ్గింది. రూ. 40వేల కన్నా తక్కువ ధరకే ఈ శాంసంగ్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అన్ని ఆఫర్లతో కలిపి శాంసంగ్ గెలాక్సీ S24 దాదాపు రూ. 39వేల ధరకు లభిస్తోంది.

గత ఏడాదిలో లాంచ్ అయిన ఈ ఫోన్ దాదాపు రూ. 64,999 ధరకు లభిస్తుంది. కాంపాక్ట్ సైజుతో ఆల్ రౌండర్. ట్రిపుల్ కెమెరా, అద్భుతమైన డిజైన్, అమోల్డ్ స్క్రీన్, మీ గేమింగ్ సెషన్‌లతో అదిరిపోయే పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర ఎంతంటే? : ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S24 ధర రూ.41,999గా ఉంది. ప్రస్తుత ధర కన్నా రూ.23వేలు తగ్గింపు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ వాడకంపై రూ.2వేలు కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో ధర రూ.39,849 కన్నా తక్కువకు పొందవచ్చు.

మీరు కొనుగోలుదారులైతే నెలకు రూ.4,667 నుంచి ఈఎంఐ ఆప్షన్లలో కూడా ఎంచుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు డీల్‌కు వర్తిస్తాయి. అదనంగా, మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏ డివైజ్ ఎక్స్చేంజ్ చేస్తారో దాని వర్కింగ్ కండిషన్ బట్టి రూ. 41,160 వరకు వాల్యూను పొందవచ్చు. కొనుగోలుదారులు ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S24 స్పెషిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఎక్సినోస్ 2400 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 4,000mAh బ్యాటరీతో వస్తుంది. 25W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, USB 3.2 పోర్ట్‌ను కూడా అందిస్తుంది. ఫోటోల విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 50MP మెయిన్, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
