Best Mobile Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి బ్రో.. రూ. 25వేల ధరలో 5 బెస్ట్ బడ్జెట్ ఫోన్లు ఇవే.. లాస్ట్ ఫోన్ మాత్రం కిర్రాక్ అంతే..!
Best Mobile Phones : 2025లో రూ. 25వేల లోపు ధరలో మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో 5 బెస్ట్ మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. ఏది కొంటారో మీదే ఛాయిస్..
Best Mobile Phones
Best Mobile Phones : కొత్త మొబైల్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం భారతీయ మార్కెట్లో తక్కువ బడ్జెట్ ధరలో పవర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే పర్ఫార్మెన్స్ అందించే కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.
మీరు కూడా తక్కువ బడ్జెట్ ధరలో (Best Mobile Phones) కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. 2025లో రూ. 25వేల లోపు ధరలో కొత్త మొబైల్ ఫోన్లు కొనేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ 3a నుంచి రియల్‌మి 15T వరకు 5 అదిరిపోయే మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.
1.నథింగ్ ఫోన్ 3a (రూ. 24,999) :
నథింగ్ ఫోన్ 3a మోడల్ 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 1B కలర్స్, 120Hz, HDR10+ 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP+ 50MP+ 8MP సెటప్‌ను కలిగి ఉంది. పవర్‌ఫుల్ సెల్ఫీలను క్లిక్ చేసేందుకు ఈ స్మార్ట్‌ఫోన్ 32MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో యూనిట్ బడ్జెట్‌లో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
2.వివో T4x 5G (రూ. 14,499) :
6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో పాటు వివో T4x 5G మోడల్ 50MP డ్యూయల్-కెమెరా సెటప్, 8MP సెల్ఫీ కెమెరాతో అద్భుతమైన వ్యూను అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300, 6500mAh బ్యాటరీతో అమర్చిన ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 25వేల లోపు ధరలో బెస్ట్ ఆప్షన్.
3.రెడ్‌మి నోట్ 14 (రూ. 14,960) :
రెడ్‌మి నోట్ 14 ఫోన్ 5110mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ కలిగి ఉంది. రెడ్‌మి నోట్ 14 మీడియాటెక్ డైమన్షిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్ వేగంగా ఛార్జింగ్ అందిస్తుంది. యూనిట్ ట్రిపుల్ 50MP + 8MP + 2MP బ్యాక్ కెమెరా కలిగి ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం 20MP కెమెరా కలిగి ఉంది.
4.శాంసంగ్ గెలాక్సీ A17 (రూ. 20,499) :
శాంసంగ్ గెలాక్సీ A17 5G ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. అద్భుతమైన షాట్ కోసం ఈ యూనిట్ ట్రిపుల్ 50MP + 5MP + 2MP బ్యాక్ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ, ఎక్సినోస్ 1330 చిప్‌సెట్ కలిగి ఉంది.
5.రియల్‌మి 15T (రూ. 20,999) :
రియల్‌మి 15T ఫోన్ 60W వైర్డు ఛార్జర్‌తో భారీ 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లాంగ్ లైఫ్ వస్తుంది. డైమెన్సిటీ 6400 మ్యాక్స్ ఆండ్రాయిడ్ 15లపై రన్ అయ్యే ఈ యూనిట్ 3 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. ప్రీమియం-లెవల్ ఫొటోలను అందించే ఈ యూనిట్ 50MP + 2MP డ్యూయల్ కెమెరా, సెల్ఫీల కోసం 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.
