PM Kisan 21st Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మీరు అర్హులేనా? 21వ విడత రూ. 2వేలు పడతాయో లేదో చెక్ చేసుకోండి!
PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ 21వ విడతపై కీలక అప్‌డేట్.. అతి త్వరలో పీఎం కిసాన్ 21వ విడత విడుదల కానుంది. మీరు అర్హులేనా కాదా? చెక్ చేయండి.
PM Kisan 21st Installment Date
PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత కోసం రైతులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ నవంబర్ నెలలో 21వ విడత విడుదల కావాల్సి ఉంది. కొంతమంది రైతులకు రూ. 2వేలు విడుదల అయినప్పటికీ దేశవ్యాప్తంగా చాలామంది రైతులకు ఇంకా 21వ విడత డబ్బులు విడుదల కాలేదు.
మరోవైపు మోదీ ప్రభుత్వం అనర్హులను (PM Kisan 21st Installment) పీఎం కిసాన్ జాబితా నుంచి తొలగిస్తోంది. రూ. 2వేలు విడుదలకు ముందుగానే లబ్ధిదారు రైతులు పీఎం కిసాన్ పథకానికి తమ అర్హత ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. పీఎం కిసాన్ ప్రయోజనాన్ని పొందేందుకు అర్హత పొందడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులను కూడా విధించింది. అవేంటో ఓసారి లుక్కేయండి.
PM కిసాన్ 21వ వాయిదా తేదీ.. ఎవరు అర్హులు? :
- భారత పౌరుడిగా ఉండండి
- సొంత సాగు భూమి
- చిన్న లేదా సన్నకారు రైతు
- నెలకు రూ. 10వేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షనర్ కాకూడదు.
- ఆదాయపు పన్ను దాఖలు చేసి ఉండకూడదు
- సంస్థాగత భూస్వామిగా ఉండకూడదు.
ఈ రైతులకు పీఎం కిసాన్ 21వ వాయిదా అందదు :
పీఎం కిసాన్ పోర్టల్ ప్రకారం.. వ్యవసాయ శాఖ ఈ పథకం మినహాయింపు కిందకు వచ్చే కొన్ని అనుమానిత కేసులను గుర్తించింది. ఇందులో ఉదాహరణకు.. 1-2-2019 తర్వాత భూమి యాజమాన్యాన్ని పొందిన రైతులు, కుటుంబ సభ్యులు ఒకరి కన్నా ఎక్కువ మంది ప్రయోజనాలు పొందుతున్న వారికి పీఎం కిసాన్ రూ. 2వేలు పడవు.
అందులో భార్యాభర్తలిద్దరూ, వయోజన సభ్యుడు మైనర్ వంటివి ఉన్నాయి. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు ఇలాంటి కేసులకు ప్రయోజనాలు తాత్కాలికంగా నిలిపివేస్తారు. మరిన్ని వివరాల కోసం రైతులు పీఎం కిసాన్ వెబ్‌సైట్/మొబైల్ యాప్ లేదా కిసాన్ ఇమిత్రా చాట్‌బాట్‌లోని నో యువర్ స్టేటస్ (KYS)లో అర్హత స్టేటస్ చెక్ చేయాలని అభ్యర్థించారని పీఎం కిసాన్ పోర్టల్ పేర్కొంది.
పీఎం కిసాన్ లబ్ధిదారుడి స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
-
- అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in)ని విజిట్ చేయండి.
- ‘Know Your Status’పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేయండి.
- అలాగే, మీ eKYC పూర్తయిందని నిర్ధారించుకోండి.
- ఎందుకంటే 21వ వాయిదాల విడుదలకు తప్పనిసరి.
e-KYC ఎలా పూర్తి చేయాలి? :
- పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) తప్పనిసరి.
- లేదంటే మీ పేరు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించవచ్చు.
- మీరు e-KYC ప్రక్రియ 3 సులభమైన మార్గాల్లో పూర్తి చేయవచ్చు.
- OTP ఆధారిత e-KYC : మీ ఆధార్ మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేసి ఉంటే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను విజిట్ చేసి OTPతో వెరిఫై చేయండి.
- బయోమెట్రిక్ e-KYC : ఫింగర్ ఫ్రింట్ అథెంటికేషన్ కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని విజిట్ చేయండి.
- ఫేస్ రికగ్నైజేషన్ : సీనియర్ సిటిజన్లు, వికలాంగులైన రైతుల కోసం ఒక ప్రత్యేక సౌకర్యం ఇప్పుడు (CSC)లో అందుబాటులో ఉంది.
- ఫేస్ ఐడింటిటీఫికేషన్ ద్వారా e-KYCని పూర్తి చేయొచ్చు.
- ఈ పథకం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు eKYC తప్పనిసరి.
పీఎం కిసాన్ 21వ వాయిదా ఎప్పుడంటే? :
నివేదికల ప్రకారం.. ప్రధానమంత్రి కిసాన్ పథకం వచ్చే వాయిదా (21వ విడత) నవంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. జమ్మూ కాశ్మీర్‌లోని వరదలు కొండచరియలు విరిగిపడిన రైతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) పథకం 21వ విడతను విడుదల చేసిందని గమనించాలి.
కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అక్టోబర్ 7న న్యూఢిల్లీలోని కృషి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముందస్తుగా 21వ వాయిదాను విడుదల చేశారు. ఈ విడుదల కింద జమ్మూ కాశ్మీర్‌లోని 85వేల మంది మహిళా రైతులు సహా 8.55 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.171 కోట్లు నేరుగా బదిలీ అయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతంలోని రైతులు ఇప్పటివరకు పీఎం కిసాన్ కింద మొత్తం రూ.4,052 కోట్లు అందుకున్నారు.
పీఎం కిసాన్ స్కీమ్ ఏంటి? :
2019లో అప్పటి ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ తాత్కాలిక బడ్జెట్‌లో ప్రకటించాక పీఎం కిసాన్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకంగా మారింది. దీని కింద, అర్హత కలిగిన రైతులు ప్రతి 4 నెలలకు రూ. 2,000 చొప్పున మొత్తం ఏటా రూ. 6వేలు చొప్పున ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్ డిసెంబర్-మార్చి అందుకుంటారు. ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.
పీఎం కిసాన్ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? :
- అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in)కి వెళ్లండి.
- ‘New Farmer Registration’పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నంబర్ క్యాప్చాను ఎంటర్ చేయండి.
- వివరాలను ఎంటర్ చేసి ‘YES’పై క్లిక్ చేయండి.
- ఫారమ్‌ను పూర్తి చేసి (Sumbit) ప్రింటవుట్ తీసుకోండి.
- ఏవైనా సందేహాల కోసం, మీరు పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్‌లకు (155261, 011-24300606) కాల్ చేయవచ్చు
