Vivo T4x 5G : వివో లవర్స్ మీకోసమే.. భారీగా తగ్గిన కొత్త వివో T4x 5G ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Vivo T4x 5G : వివో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? వివో T4x 5G అతి తక్కువ ధరకే కొనేసుకోండి. ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన డీల్ మీకోసమే..

Vivo T4x 5G : వివో లవర్స్ మీకోసమే.. భారీగా తగ్గిన కొత్త వివో T4x 5G ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Vivo T4x 5G

Updated On : November 11, 2025 / 3:02 PM IST

Vivo T4x 5G : వివో లవర్స్ మీకోసమే.. మీరు బడ్జెట్‌లో కొత్త వివో స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా? వివో T4x 5G వెంటనే కొనేసుకోండి. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అతిపెద్ద 6500mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ మన్నిక పరంగా కూడా అద్భుతంగా ఉంది. మిలిటరీ-గ్రేడ్ మన్నికను అందిస్తుంది.

బడ్జెట్ ఫోన్‌లలో అరుదుగా (Vivo T4x 5G) కనిపించే అద్భుతమైన డిజైన్‌ను కూడా ఉంది. ఈ ఫోన్ ఏఐ ఫీచర్లతో వస్తుంది. మీరు ఈ ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్‌లతో కేవలం రూ. 10,499కి సొంతం చేసుకోవచ్చు. అయితే, బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా ఈ ఫోన్ ధర రూ. 15వేల కన్నా తక్కువే. ధర, ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వివో T4x 5Gపై డిస్కౌంట్ ఆఫర్లు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ బ్యాంక్ ఆఫర్‌తో కేవలం రూ. 14,499కే కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ. 17,999. అంటే.. మీరు ఫోన్‌పై రూ. 3,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 4వేల వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

Read Also : Second Hand Cars : మీ సెకండ్ హ్యాండ్ కారు అమ్మేశారా? ఇవి మార్చకపోతే ఉగ్రవాద కేసుల్లో ఇరుక్కోవచ్చు జాగ్రత్త!

దాంతో ధర రూ. 10,499కి తగ్గుతుంది. మీరు ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదనంగా, ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ.13వేల వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మరింత చౌకైన ధరకే కొనుగోలు చేయొచ్చు.

Vivo T4x 5G ఫీచర్లు :
వివో T4x 5G ఫోన్ 6.72-అంగుళాల డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ ఆప్షన్ కలిగి ఉంది. వాటర్, డస్ట్ నిరోధకతను కలిగి ఉంటుంది. మీడియాటెక్ 7300 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఫోన్ 7.00 కన్నా ఎక్కువ AnTuTu స్కోర్‌ను కలిగి ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో భారీ 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరాల విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. 4K రిజల్యూషన్ వరకు వీడియోలను రికార్డ్ చేయవచ్చు. సూపర్ నైట్ మోడ్‌ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ ఏఐ ఎరేజర్, ఏఐ ఫొటో ఎన్‌హాన్స్‌మెంట్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది.