Second Hand Cars : మీ సెకండ్ హ్యాండ్ కారు అమ్మేశారా? ఇవి మార్చకపోతే ఉగ్రవాద కేసుల్లో ఇరుక్కోవచ్చు జాగ్రత్త!

Second Hand Cars : సెకండ్ హ్యాండ్ కార్ల యజమానులకు బిగ్ అలర్ట్.. మీ రిజిస్ట్రేషన్ వివరాలు మార్చుకోకపోతే మీ పేరుతో జరిగే నేరాలకు మీరు బాధ్యత వహించాల్సి రావొచ్చు. తస్మాత్ జాగ్రత్త..

Second Hand Cars : మీ సెకండ్ హ్యాండ్ కారు అమ్మేశారా? ఇవి మార్చకపోతే ఉగ్రవాద కేసుల్లో ఇరుక్కోవచ్చు జాగ్రత్త!

Selling Your Second-Hand Car

Updated On : November 11, 2025 / 2:26 PM IST

Second Hand Cars : మీ సెకండ్ హ్యాండ్ కారు అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీరు పాత కారు కొన్నా లేదా అమ్మినా అసలు నిర్లక్ష్యం చేయొద్దు. లేదంటే మీ ప్రమేయం లేకుండానే ఉగ్రవాద కేసుల్లో ఇరుక్కుంటారు జాగ్రత్త.. చాలామంది కొత్త కారు కోసం లక్షలు పోసి కొనడం కన్నా తక్కువ ధరకే వస్తుంది కాదా అని సెకండ్ హ్యాండ్ కార్లను కొనేస్తుంటారు. మరికొందరు పాత కార్లను అమ్మేశాక మాకే సంబంధం ఉండదని భావిస్తుంటారు. కానీ, అనేక మంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఇక్కడే.. కారు అయితే అమ్ముతారు కానీ, ఆ కారుపై రిజిస్ట్రేషన్ వివరాలను మాత్రం పట్టించుకోరు. అలానే వదిలేస్తుంటారు.

ఇలా మీరు అమ్మిన కారు ఒకరి నుంచి మరికరికి చేతులు మారిపోతునే ఉంటుంది. ఎంతమంది చేతులు మారినా కూడా మొదట కారు కొన్న వ్యక్తి వివరాలే ఉంటాయి. అప్పుడు ఆ కారు ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలకు వాడితే మీ వివరాలే ఉంటాయి. అప్పుడు మీరు చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవలే దేశ రాజాధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ..

హ్యుందాయ్ ఐ20 కారుతో ఉగ్రదాడి :

ఈ బాంబు పేలుడు ఘటనలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది హ్యుందాయ్ ఐ20 కారును దాడికి ఉపయోగించినట్టు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో తేలింది. వాస్తవానికి ఈ కారు రిజిస్ట్రేషన్ అయింది ఒక వ్యక్తి పేరుతో కొనుగోలు చేసింది మరో వ్యక్తి.. ఇలా ఒకరి నుంచి మరొకరి చేతులు మారుతూ చివరికి ఉగ్రవాదుల చేతుల్లో చిక్కింది. ఇదే కారుతో ఉగ్రదాడికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హ్యుందాయ్ ఐ20 కారు హర్యానాలోని ఫరీదాబాద్ సెక్టార్ 37లో సెకండ్ హ్యాండ్ కార్ డీలర్ వద్ద కొనుగోలు చేసినట్టుగా తేలింది.

Read Also : Best Mobile Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి బ్రో.. రూ. 25వేల ధరలో 5 బెస్ట్ బడ్జెట్ ఫోన్లు ఇవే.. లాస్ట్ ఫోన్ మాత్రం కిర్రాక్ అంతే..!

ఒకరి నుంచి ఒకరి చేతుల్లోకి :
ముందుగా ఈ కారును మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఆ తర్వాత అతడు నదీమ్ అనే వ్యక్తికి విక్రయించాడు. ఆపై ఫరీదాబాద్‌లోని సెకండ్ హ్యాండ్ డీలర్ వద్దకు చేరింది. ఇక్కడి నుంచి అమీర్, తారిఖ్ అనే ఇద్దరు వ్యక్తుల చేతులు మారింది. చివరిగా మహమ్మద్ ఉమర్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఈ కారు కొనుగోలు చేసిన అందరిని పోలీసులు విచారిస్తున్నారు. వీరిలో ఎవరు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారు? ఉగ్రవాదులతో ఎవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ బాంబు పేలుడు ఘటన పరంగా పరిశీలిస్తే.. మీ ప్రవేయం లేకున్నా ఇలాంటి ఉగ్రవాద కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. అందుకే సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడమే కాదు.. విక్రయించే ముందు కూడా ఆయా వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలను తప్పక మార్చుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మీరు కూడా సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు చేసేటప్పుడు, వాహన రిజిస్ట్రేషన్ వివరాలు మీ పేరుతో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ అలాగే ఉంటే త్వరగా ఆయా వివరాలను మార్చుకోవాలని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

రిజిస్ట్రేషన్ మార్పు ఎందుకు ముఖ్యమంటే? :

రవాణా శాఖ మార్గదర్శకాల ప్రకారం.. సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుదారులు తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఉంటే.. వెంటనే మార్చుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు.. గతంలో ఆ వాహనంపై ఏమైనా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులు ఉన్నాయా? లేదా అనేది చెక్ చేసుకోవాలి. సెకండ్ హ్యాండ్ కార్ల రిజిస్ట్రేషన్ మీ పేరుతో లేని పక్షంలో అది చట్టపరంగా చెల్లదు.

Read Also : Best Budget Cars : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. రూ. 10 లక్షల్లో టాప్ 5 లగ్జరీ లుక్ బడ్జెట్ కార్లు.. స్టైల్, మైలేజీ కోసమైన కొనేసుకోవచ్చు!

చట్టం ప్రకారం.. మీరు కారు నడిపే ముందు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులు చేయకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు. మీరు కారును ఇతర ప్రయోజనాల కోసం వాడే సమయంలో వాహనం రిజిస్ట్రేషన్ ఇష్యూలతో సమస్యలు రాకుండా రిజిస్ట్రేషన్ వివరాలను అప్‌డేట్ చేయడం అత్యంత అవసరమని గమనించాలి.

చట్టపరమైన చర్యలు తప్పవు :
మీరు కారు రిజిస్ట్రేషన్ మార్చకపోతే.. పెద్ద మొత్తంలో ఫైన్లు, జాప్యాలు లేదా ట్రాఫిక్ చట్టాలు ఉల్లంఘన వంటి చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. మరిన్ని లీగల్ ఇష్యూలను కూడా ఎదుర్కొనవచ్చు.సెకండ్ హ్యాండ్ కార్ కొనుగోలు చేస్తే అది మీ పేరులో రిజిస్టర్ అయితే.. వెంటనే రిజిస్ట్రేషన్ మార్పులు చేయడం అత్యంత ముఖ్యం. ఇలాంటి మార్పులు గమనించకపోతే ఉగ్రవాద చర్యలకు సంబంధించి అనేక చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త..