Google Photos Features : గూగుల్‌ ఫొటోస్‌లో ఇంట్రెస్టింగ్ ఏఐ ఫీచర్.. మీకిష్టమైన వీడియోలను ఇలా హైలైట్ చేయొచ్చు తెలుసా?

Google Photos Features : గూగుల్‌ ఫొటోస్‌లో ఇంట్రెస్టింగ్ ఏఐ ఫీచర్ చూశారా? మీకిష్టమైన వీడియోలను, ఫొటోలను గ్యాలరీల నుంచి ఎంచుకుని హైలెట్ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

How to create highlight videos using Google Photos

Google Photos Features : ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ (Google) ఫొటో షేరింగ్ యాప్ గూగుల్ ఫొటోలు (Google Photos) ఇప్పుడు మీకు ఇష్టమైన మూమెంట్స్ నుంచి ప్రత్యేక హైలైట్ వీడియోలను క్రియేట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్‌ డివైజ్‌ల్లో సంవత్సరాలుగా పాపులర్ గ్యాలరీ యాప్‌గా మారింది. మొదట్లో బ్యాకప్ టూల్‌గా తర్వాత మ్యాజిక్ ఎరేజర్, ఫొటో అన్‌బ్లర్ వంటి ఫీచర్లను అందిస్తోంది. ఇప్పుడు, మీ మెమరీస్ నుంచి ‘Highlight Videos‘ క్రియేట్ చేసే సరికొత్త (AI) ఫీచర్‌ను అందిస్తోంది.

హైలైట్ వీడియోలు : గూగుల్ ఫొటోలు AI-ఆధారిత ఫీచర్ :
గూగుల్ ఫొటోలు అనేది గతంలో మూవీ మేకర్ యాక్టివిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా ‘హైలైట్ వీడియోలు’తో భర్తీ చేసింది. ఈ ఫీచర్ ఆటోమాటిక్‌గా బెస్ట్ వీడియోలను క్లిప్‌లను యాడ్ చేసేందుకు అనుమతి ఇస్తుంది. అనేక సౌండ్‌ట్రాక్‌లను యాడ్ చేస్తుంది. అలాగే, మ్యూజిక్‌తో వీడియోను కూడా సింకరైజ్ చేసుకోవచ్చు. అయినప్పటికీ, మీరు ఎడిటర్‌ని ఉపయోగించి ప్రక్రియపై పూర్తి కంట్రోల్ కూడా తీసుకోవచ్చు. మీ ప్రాధాన్యతల ప్రకారం.. వీడియో క్లిప్‌లను మాన్యువల్‌గా ట్రిమ్ చేయడానికి, సెట్ చేయడానికి అనుమతిస్తుంది.

Read Also : Tech Tips in Telugu : వాట్సాప్ ఛానల్ అంటే ఏంటి? ఏదైనా ఛానల్ ఎలా అన్‌ఫాలో చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

గూగుల్ ఫొటోలలో హైలైట్ వీడియోలను ఎలా క్రియేట్ చేయాలంటే? :
1. గూగుల్ ఫొటోల యాప్‌ను ఓపెన్ చేయండి. మీ Android లేదా iOS డివైజ్‌లో గూగుల్ ఫొటోల యాప్‌ను ఓపెన్ చేయండి.
2. కొత్త ఫీచర్‌ని యాక్సెస్ చేయండి. ఇప్పుడు షేరింగ్ ట్యాబ్ పక్కన ఉన్న కొత్త + ఐకాన్ ఎంచుకోండి.
3. హైలైట్ వీడియోని ఎంచుకోండి. (+) ఐకాన్ Tap చేయండి. కోల్లెజ్, ఆల్బమ్, యానిమేషన్, సినిమాటిక్ ఫొటోతో సహా కనిపించే ఆప్షన్ల జాబితా నుంచి వీడియోను హైలైట్ చేయండి.
4. ఇప్పుడు Edit చేయండి. మీరు హైలైట్ వీడియోను ఎంచుకున్న తర్వాత యాప్ మిమ్మల్ని ఎడిటర్‌కి రీడైరెక్ట్ అయ్యేలా చేస్తుంది.

Google Photos Features

5. AI మేజిక్ వర్క్.. మీ హైలైట్ వీడియోలో యాడ్ చేసే ఫొటోలు, వీడియో క్లిప్‌లను ఎంచుకోండి. AI అల్గారిథమ్‌ను అద్భుతంగా అందిస్తుంది. మీరు ఎంచుకున్న మీడియాను ఉపయోగించి ఆటోమాటిక్‌గా 1-నిమిషం క్లిప్‌ని రూపొందిస్తుంది. Pre-set మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు.
6. మాన్యువల్ ఎడిటింగ్ (ఆప్షనల్) : కస్టమైజ్ చేసిన హైలైట్ వీడియోని క్రియేట్ చేయడానికి క్లిప్‌లను మాన్యువల్‌గా ట్రిమ్ చేసేందుకు వరుసక్రమాన్ని మార్చడానికి మీరు ఎడిటర్‌ని ఉపయోగించవచ్చు.
7. Share చేయండి లేదా Save చేయండి.

మీ హైలైట్ వీడియో క్రియేట్ చేసిన తర్వాత షేర్ చేయడానికి లేదా మీ డివైజ్‌లో సేవ్ చేయడానికి ఎంచుకోవచ్చు. గూగుల్ ఫొటోల యాప్ Android, iOS వెర్షన్‌లలో హైలైట్ వీడియోల ఫీచర్ క్రమంగా అందుబాటులోకి వస్తోందని గమనించడం ముఖ్యం. మీకు ఇంకా కనిపించకుంటే.. పెండింగ్‌లో ఉన్న అప్‌డేట్‌లను చెక్ చేయండి. గూగుల్ ఫొటోల వెబ్ వెర్షన్ కోసం ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.

Read Also : Tech Tips in Telugu : మీ ఇంటర్నెట్ యాక్టివిటీని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ట్రాక్ చేస్తున్నాయా? వెంటనే ఇలా ఆపేయండి!