Gemini Veo 2
Gemini Veo 2 : ప్రస్తుత రోజుల్లో ఏఐకి ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఏఐతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. లేనిది ఉన్నట్టుగా రియల్ లేదా ఏఐ అనేది కూడా గుర్తుపట్టనంతగా ఫొటోలు, వీడియోలను జనరేట్ చేసి ఇస్తాయి. అందుకే చాలామంది ఏఐ వీడియోలు, ఫొటోలతో కొత్తగా జనరేట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో అడ్వాన్స్‌డ్ AI వీడియో జనరేషన్ మోడల్ Veo 2 విడుదల అయింది. ఈ ఏఐ వీడియో జనరేషన్ మోడల్ ఇంటిగ్రేషన్‌తో గూగుల్ జెమిని అడ్వాన్స్‌డ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. Veo 2 అనేది వైడ్ రేంజ్ సబ్జెక్టులు, స్టయిల్స్, నమ్మలేని విధంగా హై-క్వాలిటీ సినిమాటిక్-స్టయిల్ వీడియోలను జనరేట్ చేయొచ్చు.
అన్నీ రెగ్యులర్ ప్రాంప్ట్స్ నుంచి లేటెస్ట్ అప్‌డేట్‌తో జెమిని అడ్వాన్స్‌డ్ యూజర్లకు ఇప్పుడు టెక్స్ట్ ఆధారిత ప్రాంప్ట్‌లను డైనమిక్, విజువల్‌గా ఆకర్షణీయమైన వీడియోలుగా జనరేట్ చేయగలదు. అదనంగా, గూగుల్ ల్యాబ్స్ టూల్ Whisk కూడా అప్ గ్రేడ్ అయింది. ఈ టూల్ ద్వారా టెక్స్ట్, ఇమేజ్ ప్రాంప్ట్‌లను కలిపి అద్భుతమైన విజువల్స్‌ను జనరేట్ చేయొచ్చు.
ఈ కొత్త అప్‌గ్రేడ్‌తో (Whisk) ఇప్పుడు వీడియో యానిమేషన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. వినియోగదారులు ఏఐ-జనరేటెడ్ మోషన్‌తో స్టిల్ ఇమేజ్‌లకు జీవం పోయొచ్చు. జెమిని (Whisk with Veo 2)లో ఏఐ వీడియోలను జనరేట్ చేయొచ్చు. Veo 2తో జెమినిలో వీడియోలను ఎలా క్రియేట్ చేయాలి? ఏఐ వీడియో మోడల్ వీడియో జనరేషన్ టెక్నాలజీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
రియలిస్టుగా హై-రిజల్యూషన్, సినిమాటిక్-స్టయిల్ వీడియోలను జనరేట్ చేయొచ్చు. రియల్ వరల్డ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. Veo 2 వైడ్ రేంజ్ స్టయల్స్, నేచరల్ బ్యూటీ, విజువల్‌గా అద్భుతమైన దృశ్యాలను జనరేట్ చేస్తుంది. 720p రిజల్యూషన్‌లో 8 సెకన్ల వీడియోలను జనరేట్ చేయగలదు. 16:9 ల్యాండ్‌స్కేప్ ఫార్మాట్‌లో MP4 ఫైల్‌గా అందిస్తుంది. ఇప్పుడు, Veo 2ని ఉపయోగించి Geminiలో వీడియోలను జనరేట్ చేసేందుకు ఈ కింది విధంగో ఓసారి ప్రయత్నించండి.
మీరు జనరేట్ చేసే ఏఐ వీడియోలపై నెలవారీ పరిమితి ఉందని గమనించాలి. మీ పరిమితిని రీచ్ అయిన వెంటనే జెమిని మీకు నోటిఫై చేస్తుంది. Veo 2తో వీడియో జనరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జెమిని అడ్వాన్స్‌డ్ యూజర్లకు వెబ్, మొబైల్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.
ఈ ఫీచర్ గూగుల్ వన్ ఏఐ ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం జెమిని అందించే అన్ని భాషలకు సపోర్టు ఇస్తుంది. విస్క్ యానిమేట్ అనేది డిసెంబర్‌లో ప్రారంభమైంది. గూగుల్ ల్యాబ్స్ ప్రయోగాత్మకంగా ఈ టూల్ డెవలప్ చేసింది.
వినియోగదారులు విజువల్స్‌ను క్రియేట్ చేసేందుకు టెక్స్ట్, ఇమేజ్ ప్రాంప్ట్‌లను ఉపయోగించడం ద్వారా సరికొత్త యానిమేషన్ వీడియోలను జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు, (Whisk Animate) ఫీచర్ సాయంతో వినియోగదారులు పవర్‌ఫుల్ Veo 2 మోడల్‌ను ఉపయోగించి ఫొటోలను చిన్నపాటి యానిమేటెడ్ వీడియోలుగా మార్చవచ్చు.
వీడియోలు దాదాపు 8 సెకన్ల నిడివితో యానిమేషన్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఇప్పుడు 60కి పైగా దేశాలలో (Google One AI) ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులో ఉంది. వినియోగదారులు (labs.google/whisk) విజిట్ చేసి ఓసారి ట్రై చేయొచ్చు. ప్రస్తుతం భారత్‌లో (Google Whisk) అందుబాటులో లేదని గమనించాలి.