Lava Play Ultra 5G : లావా ప్లే అల్ట్రా 5G గేమింగ్ ఫోన్ సేల్ మొదలైందోచ్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు.. డోంట్ మిస్..!

Lava Play Ultra 5G : కొత్త లావా ఫోన్ కొంటున్నారా? బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ మీకోసమే.. ఈ 5G అల్ట్రా ఫోన్ సేల్ మొదలైంది.

Lava Play Ultra 5G : లావా ప్లే అల్ట్రా 5G గేమింగ్ ఫోన్ సేల్ మొదలైందోచ్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు.. డోంట్ మిస్..!

Lava Play Ultra 5G

Updated On : August 25, 2025 / 5:45 PM IST

Lava Play Ultra 5G : లావా ఫ్యాన్స్ మీకోసమే.. లావా బడ్జెట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ లావా ప్లే అల్ట్రా 5G సేల్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ లావా ఫోన్ (Lava Play Ultra 5G) మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 64MP కెమెరా, ఆండ్రాయిడ్ 15 వంటి ఫీచర్లను కలిగి ఉంది. అమెజాన్ ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక బ్యాంక్ డిస్కౌంట్లతో పొందవచ్చు.

లావా ప్లే అల్ట్రా 5G భారత్ ధర, వేరియంట్లు :
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ. 14,999.
8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ. 16,499.
ఈ ఫోన్ ఆర్కిటిక్ ఫ్రాస్ట్, ఆర్కిటిక్ స్లేట్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్లు :
లావా ప్లే అల్ట్రా 5G ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ. 13,999 నుంచి రూ. 14,999 మధ్య లభ్యమవుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎంపిక చేసిన HDFC, SBI, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. వెయ్యి బ్యాంక్ డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈఎంఐ లావాదేవీలు కూడా పొందవచ్చు. లావా ఫ్రీ డోర్‌స్టెప్ సర్వీస్‌ను కూడా అందిస్తోంది.

Lava Play Ultra 5G : డిస్ ప్లే, పర్ఫార్మెన్స్ :

ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. మృదువైన గేమింగ్, వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్‌తో వస్తుంది. 8GB వరకు ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. హైపర్‌ఇంజిన్ గేమింగ్ టెక్నాలజీ 20శాతం అధిక FPS, గ్రాఫిక్స్, బ్యాటరీని అందిస్తుంది.

ఫొటోగ్రఫీ, వీడియో, కెమెరాలు :
లావా ప్లే అల్ట్రా 5G బ్యాక్ సైడ్ 64MP సోనీ IMX682 ప్రైమరీ సెన్సార్, 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరా నైట్ మోడ్, పోర్ట్రెయిట్, HDR, AI టూల్స్, పనోరమా, బ్యూటీ మోడ్, స్లో మోషన్ రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : Top Car Discounts : కొత్త కార్లు భలే ఉన్నాయి చూశారా? రూ. 5 లక్షల్లోపు సరసమైన స్టైలీష్ కార్లు ఇవే.. ఏది కొంటారో మీఇష్టం..!

బ్యాటరీ, ఛార్జింగ్ :
ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. కేవలం 83 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్ 45 గంటల టాక్ టైమ్, 510 గంటల స్టాండ్‌బై, దాదాపు 650 నిమిషాల యూట్యూబ్ ప్లేబ్యాక్‌ను అందిస్తుందని లావా పేర్కొంది.

సాఫ్ట్‌వేర్, అప్‌డేట్స్ :
ఈ లావా ప్లే బ్లోట్‌వేర్ లెస్, క్లీన్ యూఐతో ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. లావా 2 ఏళ్ల OS అప్‌గ్రేడ్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ హామీ ఇచ్చింది.

ఆడియో, కనెక్టివిటీ ఫీచర్లు :
డ్యూయల్ స్టీరియో స్పీకర్లు
IP64 సర్టిఫికేట్
డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్, 1TB వరకు స్టోరేజీ
వై-ఫై 6, బ్లూటూత్ 5.2, OTG, USB టైప్-C కనెక్టివిటీ