iPhone 17 Air Launch : ఆపిల్ ఫోనా మజాకా.. ఐఫోన్ 17 ఎయిర్ దించుతోంది.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.. లేటెస్ట్ లీక్స్ ఇదిగో..!
iPhone 17 Air Launch : ఆపిల్ ఫోన్ క్రేజే వేరబ్బా.. ఐఫోన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 ఎయిర్ ఫీచర్లు, ధర, స్పెషిఫికేషన్లు, కలర్ ఆప్షన్లు, డిజైన్ అన్ని వివరాలు లీక్ అయ్యాయి.

iPhone 17 Air Launch Date
iPhone 17 Air Launch : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో ఐఫోన్ ప్రియుల కోసం ఐఫోన్ 17 ఎయిర్ వచ్చేస్తోంది. 2025లో రాబోయే ఐఫోన్ 17 సిరీస్ గురించి అనేక రుమర్లు వస్తున్నాయి. ఇప్పటివరకూ ఆపిల్ ఐఫోన్లలో సాధారణ ఐఫోన్ 17, 17 ప్రో, 17 ప్రో మాక్స్ గురించి విన్నాం.. కానీ, కిర్రాక్ పుట్టించే మరో కొత్త ఐఫోన్ రాబోతుంది.
అదే.. ఐఫోన్ 17 ఎయిర్. ఈ కొత్త మోడల్ “ప్లస్” వెర్షన్ స్థానంలో వస్తుందని భావిస్తున్నారు. ఆపిల్ అత్యంత సన్నని ఐఫోన్‌గా చెప్పవచ్చు. ఐఫోన్ 17 ఎయిర్ గురించి ఇప్పటివరకు డిజైన్, కెమెరా, స్పెషిఫికేషన్లు, భారత్, దుబాయ్, అమెరికా కలర్ ఆప్షన్ల గురించి అనేక వివరాలు లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
ఐఫోన్ 17 ఎయిర్ డిజైన్ లీక్ :
లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ 17 ఎయిర్ అల్ట్రా-థిన్ ప్రొఫైల్‌తో రావచ్చు. 5.5mm, 6.25mm మధ్య ఉంటుంది. ఐఫోన్ 6 6.9mm కన్నా చాలా సన్నగా ఉంటుంది. టిప్‌స్టర్ మాజిన్ బు షేర్ చేసిన లీకైన 3D రెండర్‌లు ప్రో మోడల్ ఎయిర్ మాదిరిగా ఉన్నాయి. ఫోన్ మందంలో కొద్దిగా వ్యత్యాసం ఉన్నట్టుగా కనిపిస్తోంది. మినిమలిస్ట్ స్మార్ట్‌ఫోన్ ఫ్యాన్స్‌ను మరింతగా ఆకర్షించవచ్చు.
ఐఫోన్ 17 ఎయిర్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఐఫోన్ 17 ఎయిర్ నెక్స్ట్ జనరేషన్ A19 చిప్ ద్వారా పవర్ అందించనుంది. 8GB ర్యామ్ సపోర్టు కూడా ఉండొచ్చు. గేమింగ్ లేదా 4K వీడియో రికార్డింగ్ సెషన్ల సమయంలో హీట్ కోసం ఆపిల్ కొత్త స్టీమ్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది.
ఐఫోన్ 17 ఎయిర్ కెమెరా లీక్ :
ఐఫోన్ ప్రో మోడళ్లలో మాదిరి అల్ట్రా-వైడ్ లెన్స్ లేనప్పటికీ, ఐఫోన్ 17 ఎయిర్ 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP మెయిన్ కెమెరా, షార్ప్ సెల్ఫీల కోసం 24MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. రుమర్ల ప్రకారం.. 8K వీడియో రికార్డింగ్ ప్రో వేరియంట్‌లలో మాత్రమే కాకుండా అన్ని మోడళ్లలో ఉండొచ్చు. అయితే, కొన్ని లీక్‌లు ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉండవచ్చని సూచిస్తున్నాయి.
ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్, ధర (అంచనా) :
ఆపిల్ సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 13, 2025 మధ్య ఐఫోన్ 17 లైనప్‌ను రిలీజ్ చేయనుందని భావిస్తున్నారు. ధరల విషయానికొస్తే.. ఐఫోన్ 17 ఎయిర్ ఐఫోన్ 16 ప్లస్ ధరల మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. భారత్‌లో రూ. 89,900, దుబాయ్ : AED 3,799, అమెరికాలో 899 డాలర్లు ఉండే అవకాశం ఉంది.