BSNL 5G SIM : గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే BSNL 5G సిమ్ ఆర్డర్ చేయొచ్చు.. ఇలా చేస్తే.. 90 నిమిషాల్లో హోం డెలివరీ..!

BSNL 5G SIM : బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటున్నారా? మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంటి వద్ద నుంచే ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ సింపిల్ ప్రాసెస్ మీకోసం..

BSNL 5G SIM : గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే BSNL 5G సిమ్ ఆర్డర్ చేయొచ్చు.. ఇలా చేస్తే.. 90 నిమిషాల్లో హోం డెలివరీ..!

BSNL 5G SIM now available online

Updated On : April 19, 2025 / 1:42 PM IST

BSNL 5G SIM Card : కొత్త BSNL సిమ్ కావాలా? అయితే, ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. హోం డెలివరీ ద్వారా ఇంటికి బీఎస్ఎన్ఎల్ సిమ్ వస్తుంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశవ్యాప్తంగా 4G విస్తరణను వేగవంతం చేస్తోంది.

Read Also : Flipkart AC Sales : వేసవిలో కొత్త AC కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే టాప్ బ్రాండ్ ఏసీలు.. సగం ధరకే కొనేసుకోవచ్చు..!

మార్చి 2025 నాటికి లక్ష 4G టవర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి 80వేల టవర్లు ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న 4G మౌలిక సదుపాయాలను ఉపయోగించి 5G సర్వీసులను కూడా అందుబాటులోకి తేవాలని కృషి చేస్తోంది. BSNL యూజర్లు త్వరలో కనీస అప్‌గ్రేడ్‌లతో 5G స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.

టారిఫ్ పెంపుతో BSNL వైపు యూజర్ల ఆసక్తి :
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇటీవల టారిఫ్ పెంపుదలతో చాలా మంది వినియోగదారులు BSNLకు మారుతున్నారు. జూలై 2024లో బిఎస్‌ఎన్‌ఎల్ టెలికం దిగ్గజం ఆంధ్రప్రదేశ్‌లోనే 2.17 లక్షలకు పైగా కొత్త కస్టమర్లను చేర్చుకుంది.

BSNL స్టోర్ల వద్ద భారీ క్యూలు :
సిమ్ కార్డు కొనుగోలుకు భారీ డిమాండ్ కారణంగా బీఎస్ఎన్ఎల్ ఆఫీసులు రద్దీగా మారుతున్నాయి. చాలా మంది వినియోగదారులు స్వయంగా సిమ్ కార్డులను పొందలేకపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు BSNL స్పీడ్ డెలివరీతో పాటు ఈజీ KYC ప్రాసెస్ కోసం ఆన్‌లైన్ సిమ్ ఆర్డరింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది.

Read Also : Amazon Sale : స్టూడెంట్స్ కోసం అమెజాన్ స్పెషల్ సేల్.. ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌‌లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

BSNL సిమ్ కార్డును ఆన్‌లైన్‌లో ఎలా ఆర్డర్ చేయాలి? :

  • మీరు కొత్త BSNL 4G లేదా 5G సిమ్ కావాలనుకుంటే.. ఆన్‌లైన్‌లో ఎలా ఆర్డర్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
  • కొత్త సిమ్ కోసం ఈ (https://prune.co.in/) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • “Buy SIM Card”పై క్లిక్ చేసి, మీ దేశం (India) ఎంచుకోండి.
  • మీ ఆపరేటర్‌గా BSNL ఎంచుకుని, మీకు నచ్చిన FRC (ఫస్ట్ రీఛార్జ్ కూపన్) ప్లాన్‌ను ఎంచుకోండి.
  • మీ పూర్తి వివరాలను సమర్పించండి. OTPతో వెరిఫై చేసుకోండి.
  • మీ అడ్రస్ ఎంటర్ చేసి, స్క్రీన్‌పై ఉన్న సూచనలను ఫాలో అవ్వండి.
  • మీ SIM 90 నిమిషాల్లోపు డెలివరీ అవుతుంది.
  • ఇన్‌స్టంట్ యాక్టివేషన్, ఇంటి వద్దనే KYC పూర్తి చేసుకోవచ్చు.