Flipkart AC Sales : వేసవిలో కొత్త AC కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే టాప్ బ్రాండ్ ఏసీలు.. సగం ధరకే కొనేసుకోవచ్చు..!
Flipkart Super Cooling Days Sale : కొత్త ఏసీ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత సరసమైన ధరకే కొత్త 1.5 టన్ స్ప్లిట్ ఏసీలు లభ్యమవుతున్నాయి. ఈ డిస్కౌంట్ డీల్స్ డోంట్ మిస్..

Flipkart Super Cooling Days Sale
Flipkart Super Cooling Days Sale : వేసవిలో కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? మీకోసం ఈ-కామర్స్ దిగ్గజాలు స్మార్ట్ సేల్స్ అందిస్తున్నాయి. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ సేల్‌ను ప్రారంభించింది.
ఈ సేల్ ద్వారా మీరు 50 శాతం వరకు తగ్గింపుతో 1.5 టన్ ఏసీని కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ సేల్‌ను ఏప్రిల్ 16 నుంచి ప్రారంభించింది. అప్లియన్సెస్ ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, కూలర్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.
మీ ఎయిర్ కూలర్లను అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన సమయం. ఈ సేల్‌లో డైకిన్, బ్లూ స్టార్, వోల్టాస్, క్యారియర్, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్ మార్క్యూ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి 1.5-టన్ స్ప్లిట్ ఏసీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ సమయంలో బెస్ట్ 1.5-టన్ స్ప్లిట్ ఏసీ డీల్స్ ఇలా ఉన్నాయి.
1. MarQ 1.5 టన్ 3-స్టార్ స్ప్లిట్ ఏసీ : ధర రూ.24,990
ఈ సేల్‌లో అత్యంత బడ్జెట్-ఫెండ్లీ ఆప్షన్లలో ఒకటి MarQ 1.5 టన్ 3-స్టార్ ఏసీ. ఈ ఏసీ అసలు ధర రూ.51,999 నుంచి కేవలం రూ.24,990కి లభిస్తుంది. అంటే.. ఫ్లాట్ 51 శాతం తగ్గింపు పొందవచ్చు. ఈ ఏసీ కూలింగ్, మన్నిక కోసం 5-ఇన్-1 కన్వర్టిబుల్ టర్బో కూల్ టెక్నాలజీ, కాపర్ కండెన్సర్‌తో వస్తుంది. కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.
2. క్యారియర్ 2025 1.5 టన్ 3-స్టార్ స్ప్లిట్ ఏసీ : ధర రూ. 35,990
క్యారియర్ 1.5 టన్ ఏసీ అసలు ధర రూ.68,290 నుంచి రూ.35,990కు లభిస్తుంది. అంటే 47 శాతం తగ్గింపు. ఈ మోడల్ 6-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్‌ను కలిగి ఉంది. హై పవర్ ఫీచర్లతో వస్తుంది. Wi-Fi కనెక్టివిటీతో కూడా వస్తుంది. వినియోగదారులు రిమోట్‌గా కంట్రోల్ చేయొచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డ్ హోల్డర్లు 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
3. బ్లూ స్టార్ 2025 1.5 టన్ 3-స్టార్ స్ప్లిట్ ఏసీ : ధర రూ. 37,490
బ్లూ స్టార్ ఏసీ ఇప్పుడు ధర రూ.37,490కి అందుబాటులో ఉంది. ఈ ఏసీ అసలు ధర రూ.64,250 నుంచి తగ్గింది. 41 శాతం తగ్గింపు పొందింది. Wi-Fi కంట్రోలింగ్ కూడా సపోర్టు ఇస్తుంది. 5 శాతం వరకు అదనపు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది.
4. డైకిన్ 2024 1.5 టన్ 3-స్టార్ స్ప్లిట్ ఏసీ : ధర రూ. 38,670
డైకిన్ ప్రీమియం 1.5 టన్ మోడల్ రూ.69,990 నుంచి రూ.38,670కి లిస్టు అయింది. 44 శాతం తగ్గింపు అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై ఇన్‌స్టంట్ 10 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ సేల్ సందర్భంగా ఈ డీల్స్ పరిమిత కాలం వరకు అందుబాటులో ఉంటాయి. మీ కొత్త ఏసీని కొనుగోలు చేయాలనుకుంటే టాప్-క్వాలిటీ ఏసీలలో మీకు నచ్చిన ఏసీని ఇప్పుడే కొనేసుకోండి.