BSNL 5G SIM now available online
BSNL 5G SIM Card : కొత్త BSNL సిమ్ కావాలా? అయితే, ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. హోం డెలివరీ ద్వారా ఇంటికి బీఎస్ఎన్ఎల్ సిమ్ వస్తుంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశవ్యాప్తంగా 4G విస్తరణను వేగవంతం చేస్తోంది.
మార్చి 2025 నాటికి లక్ష 4G టవర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి 80వేల టవర్లు ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న 4G మౌలిక సదుపాయాలను ఉపయోగించి 5G సర్వీసులను కూడా అందుబాటులోకి తేవాలని కృషి చేస్తోంది. BSNL యూజర్లు త్వరలో కనీస అప్‌గ్రేడ్‌లతో 5G స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.
టారిఫ్ పెంపుతో BSNL వైపు యూజర్ల ఆసక్తి :
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇటీవల టారిఫ్ పెంపుదలతో చాలా మంది వినియోగదారులు BSNLకు మారుతున్నారు. జూలై 2024లో బిఎస్‌ఎన్‌ఎల్ టెలికం దిగ్గజం ఆంధ్రప్రదేశ్‌లోనే 2.17 లక్షలకు పైగా కొత్త కస్టమర్లను చేర్చుకుంది.
BSNL స్టోర్ల వద్ద భారీ క్యూలు :
సిమ్ కార్డు కొనుగోలుకు భారీ డిమాండ్ కారణంగా బీఎస్ఎన్ఎల్ ఆఫీసులు రద్దీగా మారుతున్నాయి. చాలా మంది వినియోగదారులు స్వయంగా సిమ్ కార్డులను పొందలేకపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు BSNL స్పీడ్ డెలివరీతో పాటు ఈజీ KYC ప్రాసెస్ కోసం ఆన్‌లైన్ సిమ్ ఆర్డరింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది.
BSNL సిమ్ కార్డును ఆన్‌లైన్‌లో ఎలా ఆర్డర్ చేయాలి? :