Post Office Accounts Link : పోస్టల్‌ అకౌంట్లను మీ బ్యాంకు అకౌంట్‌కు లింక్‌ చేశారా? లేదంటే.. డబ్బులు కష్టమే..!

పోస్టల్ అకౌంట్ దారులకు అలర్ట్.. మీ పోస్టాఫీసు అకౌంట్ ను వెంటనే మీ పొదుపు సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంకు అకౌంటుకు వెంటనే లింక్ చేసుకోండి.

Post Office Accounts Link : పోస్టల్ అకౌంట్ దారులకు అలర్ట్.. మీ పోస్టాఫీసు అకౌంట్ ను వెంటనే మీ పొదుపు సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంకు అకౌంటుకు వెంటనే లింక్ చేసుకోండి. లేదంటే వడ్డీ డబ్బులు పొందడం కష్టమే.. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా ప్రతి ఒక్క పోస్టల్ అకౌంట్ దారులు తమ పొదుపు ఖాతాను బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే పోస్టాఫీసు ద్వారా స్కీమ్ లకు సంబంధించి ప్రయోజనాలను పొందేందుకు వీలుంటుంది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసేవారికి పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయనడంలో సందేహం అక్కర్లేదు.

పోస్టుఫీసు నెలవారీ ఇన్ కమ్ స్కీమ్ 9 (MIS), సీనియర్ సిటిజన్ స్కీమ్ (SCSS) వంటి పథకాల్లో పొదుపు చేస్తే.. నెలవారీగా, త్రైమాసికంగా, వార్షికంగా ప్రాతిపాదికన క్రమంగా వడ్డీని పొందేందుకు వీలుంది. పోస్టాఫీసు ప‌థ‌కాల్లో పెట్టుబ‌డుల‌పై వ‌డ్డీ ఆదాయాన్ని కొంతమంది న‌గ‌దు రూపంలోనే విత్‌డ్రా చేసుకుంటున్నారు. ఈ విషయం పోస్టల్ శాఖ దృష్టికి వెళ్లడంతో దీనిపై ఒక సర్క్యలర్‌ జారీ చేసింది.

ఈ స‌ర్క్యులర్‌ ప్రకారం.. 2022 ఏప్రిల్ 1 నుంచి పోస్టాఫీసు పొదుపు స్కీమ్ సంబంధిత వ‌డ్డీ ఆదాయాన్ని ఆయా పొస్టాఫీసు అకౌంటుకు లింక్ చేసిన అకౌంటుకు డబ్బులు బదిలీ కానున్నాయి. అంటే.. పొదుపు ఖాతా లేదా బ్యాంకు అకౌంటుకు మాత్రమే వడ్డీ పైసలు క్రెడిట్ అవుతాయని పోస్టల్‌ శాఖ వెల్ల‌డించింది. పోస్టాఫీసు అకౌంట్లో డబ్బులు సేవింగ్స్ చేసుకునేవారు మార్చి 31వ తేదీలోగా తమ అకౌంట్లను పోస్టాఫీసు పొదుపు ఖాతా లేదా బ్యాంక్ అకౌంట్లకు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.

How To Link Post Office Savings Account With Your Bank Account, Follow These Steps

ఈ చివరి తేదీలోగా తమ పోస్టాఫీసు అకౌంట్లను లింక్ చేసుకోకపోతే వడ్డీ ఆదాయాన్ని పొందలేరు. పైగా రావాల్సిన ఆ వడ్డీ పైసలు నేరుగా సండ్రీ అకౌంట్ కు బదిలీ చేయనున్నట్టు పోస్టల్ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి సండ్రీ అకౌంట్ ద్వారా న‌గ‌దు రూపంలో చెల్లింపులు ఉండవు. ఔట్ స్టాండింగ్ వ‌డ్డీ ఆదాయాన్ని పోస్టాఫీసు పొదుపు అకౌంట్ లేదా చెక్ ద్వారా మాత్రమే చెల్లించే అవకాశం ఉందని పోస్ట‌ల్ శాఖ‌ స్పష్టం చేసింది.

మీ పొదుపు అకౌంట్ ఎందుకు లింక్ చేయాలంటే? :
పోస్టాఫీసుల్లో పొదుపు ఖాతాల్లో జమ చేసిన మొత్తంపై పొందే వడ్డీ ఆదాయాన్ని నేరుగా విత్ డ్రా చేసుకోవద్దు.
ఎందుకంటే.. ఆ వడ్డీ మొత్తాన్ని తీసుకోకుండా ఉండే.. అది పొదుపు ఖాతాలో క్రెడిట్ అవుతుంది. అప్పుడు వడ్డీపై వడ్డీని పొందవచ్చు.
మీకు అవసరమైనప్పుడు ప్రత్యేకించి పోస్టాఫీసులకు వెళ్లాల్సిన పనిలేకుండానే నేరుగా వ‌డ్డీ ఆదాయాన్ని ఆన్‌లైన్‌ ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు.
పోస్టాఫీసు అకౌంట్ల నుంచి న‌గ‌దు రూపంలో విత్‌డ్రా చేసుకోవాలంటే ప్ర‌తిసారీ ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే మీరు లింక్ చేస్తే ఫారాలు నింపాల్సిన ఇబ్బంది ఉండదిక..
డిపాజిటర్లు MIS/SCSS/ TD అకౌంట్ల నుంచి వడ్డీ ఆదాయాన్ని పోస్టాఫీస్‌ సేవింగ్స్ అకౌంట్ ద్వారా రిక‌రింగ్‌ డిపాజిట్ (RD) అకౌంట్లకు ఆటోమేటిక్‌గా క్రెడిట్ అయ్యే ఫెసిలిటీ కూడా అందిస్తోంది.

Read Also : Indian Post Office : పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు గుడ్ న్యూస్..విత్ డ్రా లిమిట్ పెంపు

ట్రెండింగ్ వార్తలు