Live Location Sharing : ఎమర్జెన్సీలో మీ లైవ్ లొకేషన్ ఫ్యామిలీతో ఇలా షేర్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్

Live Location Sharing : ఒంటరిగా వెళ్తున్నారా? కొత్త ప్రాంతానికి మొదటిసారి వెళ్తున్నారా? అందులోనూ రాత్రి వేళల్లో అయితే కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు లైవ్ లొకేషన్ షేర్ చేయడం తెలిసి ఉండాలి.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Live Location Sharing

  • కొత్త ప్రదేశానికి వెళ్తున్నారా? రూట్ సరిగా తెలియదా?
  • లైవ్ లొకేషన్ ఎలా షేర్ చేయాలో తెలియదా?
  • వాట్సాప్ లేదా గూగుల్ మ్యాప్స్ ద్వారా లైవ్ లొకేషన్ ఎలా?

Live Location Sharing : మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? మీకు తెలియని ప్రాంతానికి ఫస్ట్ టైమ్ వెళ్తున్నారా? అయితే, మీరు కారు లేదా బైకు మీద వెళ్తుంటే తప్పనిసరిగా రూట్ మ్యాప్ తెలిసి ఉండాలి. లేదంటే సరైన రూట్ తెలియక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికైనా వెళ్తుంటే వారికి క్లియర్ రూట్ తెలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

కానీ, నెట్‌వర్క్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించేవారు, ఒంటరిగా బయటకు (Live Location Sharing) వెళ్లేవారు ఎక్కువగా ఆందోళనకు గురికావాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో, మీ లైవ్ లొకేషన్‌ను షేర్ చేయడం ద్వారా మీరు సురక్షితంగా ఉన్నారని మీ ఫ్యామిలీకి తెలుసుకునే అవకాశం ఉంటుంది.

మీరు ఎక్కువగా కొత్త ప్రదేశాలకు వెళ్లే వారైతే లేదా కుటుంబ సభ్యుల కాల్స్‌ లిఫ్ట్ చేయలేకపోతే మీ లైవ్ లొకేషన్‌ను వాట్సాప్ ద్వారా ఈజీగా షేర్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వాట్సాప్ ద్వారా లైవ్ లొకేషన్ షేరింగ్ :

1 : మీ iOS/Android ఫోన్‌లో మీ వాట్సాప్ ఓపెన్ చేయండి.

2 : చాట్ బాక్స్‌లో పేపర్‌క్లిప్ ఐకాన్ క్లిక్ చేయండి.

3 : ఈ ఐకాన్ కింద కాంటాక్ట్‌లు, డాక్యుమెంట్‌లు, లొకేషన్‌ను షేర్ చేసే అనేక ఆప్షన్‌లు కనిపిస్తాయి.

4 : లొకేషన్‌పై క్లిక్ చేయండి.

5 : ‘Share Live Location’పై క్లిక్ చేయండి.

6 : మీ లొకేషన్‌ను 15 నిమిషాలు, 1 గంట లేదా 8 గంటల పాటు షేర్ చేయాలా? ఏది కావాలో ఎంచుకోండి.

Read Also : Airtel Recharge Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. 30 రోజుల వ్యాలిడిటీతో 12 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. 60GB వరకు డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

గూగుల్ మ్యాప్స్ ద్వారా లొకేషన్ షేరింగ్ :
1 : మీ iOS/Android ఫోన్‌లో, Google Mapsను ఓపెన్ చేయండి.

2 : టాప్ రైట్ సైడ్ ఉన్న మీ ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేయండి.

3 : ‘Location Sharing’పై క్లిక్ చేయండి.

4 : ఆ తర్వాత ‘Share location’పై క్లిక్ చేయండి.

5 : ఈ ఫీచర్‌తో మీ లైవ్ లొకేషన్‌ను ఎవరితోనైనా షేర్ చేయొచ్చు. మీరు లింక్‌ను కూడా కాపీ చేసుకోవచ్చు.

గూగుల్ మ్యాప్స్ ద్వారా లొకేషన్‌ షేర్ చేస్తే.. వాట్సాప్‌లో లేని వారితో కూడా మీ లైవ్ లొకేషన్‌ను షేర్ చేయొచ్చు. తద్వారా మీరు ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, జీమెయిల్‌లోని యూజర్లతో మీ లొకేషన్‌ను షేర్ చేయొచ్చు. అలాగే ఇతర డివైజ్‌లతో కూడా షేర్ చేయొచ్చు. కానీ, వాట్సాప్‌తో ఇలా లొకేషన్ షేర్ చేయలేరు.

మీరు మ్యాప్స్ కింద మీ లొకేషన్ షేరింగ్ కోసం సమయాన్ని గంట నుంచి 2 గంటల వరకు అడ్జెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ‘until you turn the feature off’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయవచ్చు.

మీకు అవసరమైనప్పుడు మాత్రమే లైవ్ లొకేషన్‌ ఆఫ్ చేయొచ్చు. వాట్సాప్ నిబంధనలు, షరతుల ప్రకారం మీ లైవ్ లొకేషన్‌ను ఒక యూజర్‌తో మాత్రమే షేర్ చేయగలరు. మీరు లేదా ఆ యూజర్ ఇతరులకు ఫార్వార్డ్ చేయొద్దు.